Advertisement
Google Ads BL

జయంత్ సి పరాన్జీ సినిమాలో రెజ్లింగ్ స్టార్


జయంత్ సి పరాన్జీ ‘నరేంద్ర’ సినిమాలో నటించనున్న  WWE  రెజ్లింగ్ స్టార్ ‘ది గ్రేట్ ఖలీ’..!!

Advertisement
CJ Advs

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడు ఈ ఏడడుగుల రెజ్లర్..  ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో, అమెరికన్ టీవీ షోల్లో నటించిన ఖలీ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కనిపించి అభిమానులను అలరించాడు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీలేష్ ఎటి, ఇజబెల్లా  జంటగా నటిస్తున్నారు.. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా రూపొందనుండడంతో ఇస్లామిక్ దేశంలో  చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా,  ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.. ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.. 

తారాగణం: నీలేష్ ఎటి, ఇజబెల్లా, ది గ్రేట్ ఖలీ

సాంకేతిక నిపుణులు : 

కథ మరియు దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ

నిర్మాత: ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల

సినిమాటోగ్రఫీ: విరీన్ తంబిదోరై

సంగీతం: రామ్ సంపత్

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

డైలాగ్స్: హరీష్ కోయలగుండ్ల

ఫైట్స్ : వెంకట్

PRO: వంశీ-శేఖర్

WWE Wrestler Star in Narendra:

WWE ‘The Great Khali’ in Director ‘Jayanth C Paranji’s ‘Narendra’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs