Advertisement
Google Ads BL

వినయ విధేయ రామ ఎఫెక్ట్.. ‘సైరా’పై..!


చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సై రా నరసింహా రెడ్డి షూటింగ్ సుదీర్ఘంగా జరుగుతూనే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు ప్రేక్షకులముందుకు వస్తుందో అనేది నిర్మాత చరణ్ కానీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి కానీ చెప్పలేకపోతున్నారు. మరోపక్క కొరటాల, చిరుతో సినిమా చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే సై రా సినిమా మొదలయినప్పటి నుండి... ఆ సినిమా మీద అనేక రకాల గాసిప్స్ ప్రచారంలో కొస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటివరకు ఆ గాసిప్స్ బాగా హల్చల్ చేశాయి.

Advertisement
CJ Advs

కానీ వినయ విధేయ రామ సినిమా ఇంటర్వూస్ లో భాగంగా రామ్ చరణ్ సై రా మీదొస్తున్న చాలా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. సై రా సినిమా షూటింగ్‌లో తృప్తి చెందని చిరు.. సురేందర్ రెడ్డి‌తో పలు సీన్స్ రీ షూట్స్ చేపిస్తున్నాడనే ప్రశ్నకు చరణ్.. రీ షూట్స్ చేసేంత బడ్జెట్ లేదని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే చరణ్ అలా బడ్జెట్ లేదని చెప్పడానికి ఇపుడొక కారణం కనబడుతుంది. ఇప్పటికే సై రా సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు బడ్జెట్ పరిమితులు పెట్టినట్లుగా ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. సై రాలో రీ షూట్స్ జరిగాయని.. రీ షూట్స్ వలన బడ్జెట్ లో రాసిన లెక్కల కన్నా... ఎక్కువ లెక్కలు తేలడంతోనే రామ్ చరణ్ బడ్జెట్ పరిమితులు విధించాడట.

ఇప్పటికే సై రా సినిమాకికి బోలెడంత ఖర్చు పెట్టేసాం.. ఇప్పుడు చెయ్యబోయే సన్నివేశాల విషయంలో కాస్త జాగ్రత్త పడమని సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ చెప్పినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. మరి చరణ్ చెప్పిన బడ్జెట్ ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న కీల‌క‌మైన స‌న్నివేశాలు, వార్ ఎపిసోడ్లు కు పెట్టేసారు. ఇకమీద జరిగే సన్నివేశాలకు అంతగా ఖర్చు ఉండదు కానీ... సురేందర్ రెడ్డి తనకు నచ్చక పొతే అస్సలు కాంప్రమైజ్ కాడు. ఆ సీన్స్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు సురేందర్ రెడ్డి ఒప్పుకోడు అందుకే చాలా సీన్స్ తీసినవే తీస్తూ ఉంటాడనే టాక్ ఉంది.. కానీ ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా బడ్జెట్ పరిమితులకు లోబడి సినిమా చెయ్యాలంటే.. సురేందర్ రెడ్డి కూడా మారాలి. అయితే రామ్ చరణ్ మాత్రం ఇలా బడ్జెట్ పరిమితులను విధించడానికి కారణం.. వినయ విధేయరామకి బోయపాటి ఎడా పెడా యాక్షన్ సన్నివేశాల కోసం ఖర్చు పెట్టించడంతోనే... సినిమాకి కలెక్షన్స్ రాక నిర్మాత పడిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకున్న చరణ్ ఇప్పుడు సై రా కి బడ్జెట్ పరిమితులు విధిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

Vinaya Vidheya Rama Effect on Sye Raa:

Ram Charan Conditions to Sye Raa Narasimaha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs