Advertisement
Google Ads BL

ఈ సినిమా జోరును ఆపేదెవరు?


ఈ నెలలో విడుదలైన సినిమాలన్ని వరసగా డుమ్మా కొట్టెయ్యడంతో... ఒకే ఒక్క సినిమా తన జోరుని ఇంకా కంటిన్యూ చేస్తోనే ఉంది. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న  అనిల్ రావిపూడి - దిల్ రాజుల ఎఫ్ 2 సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఎఫ్ 2 మాత్రమే జోరు చూపిస్తుంది. విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ అండ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సినిమాలో సెకండ్ హాఫ్ వీక్ అన్నారు. నిజంగానే ఎఫ్ 2 ఫస్ట్ హాఫ్ కామెడీతో అదరగొట్టేయ్యగా.. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగానే కాస్త ఫ్రస్టేషన్ కి గురి చేసింది. కానీ థియేటర్స్ లో ఆడుతున్న సినిమా లేకపోవడంతో ఎఫ్ 2 విజయంతో విర్రవీగుతుంది.

Advertisement
CJ Advs

గత రెండు వారాలుగా ఎదురులేని ఎఫ్ 2 సినిమాకి అఖిల్ మిస్టర్ మజ్ను, బాలీవుడ్ మూవీ మణికర్ణిక సినిమాలు అడ్డుతగులుతాయేమో అని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల హడావిడి కనిపించకపోయేసరికి ఎఫ్ 2 మళ్ళీ తన జోరు మూడో వారంలోను కంటిన్యూ చేసేస్తుంది. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం 75 కోట్ల షేర్ అందుకుంటున్న ఈ రోజుల్లో ఎఫ్ 2 ఆ ఫిగర్ ని సునాయాసంగా దాటేసింది. 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఎఫ్ 2 ఇప్పుడు 16 రోజులు తిరిగేసరికి 71 కోట్ల షేర్ ని తెచ్చిపెట్టింది. మరి వరల్డ్ వైడ్ గా 71 కోట్ల షేర్ తెచ్చిన ఎఫ్ 2...  పెద్ద పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యమవుతున్న నైజాంలో చిన్నసినిమాగా ఎఫ్ 2 జోరు మాములుగా లేదు.

నైజాంలో పెద్ద పెద్ద చిత్రాలకు మాత్రమే సాద్యమేయ్యే 20 కోట్ల ఫిగర్ ని ఎఫ్ 2 మూడు వారలు తిరక్కముందే క్రాస్ చెయ్యడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది. నైజాంలోనే కాదు  ఓవర్సీస్ లోను ఎఫ్ 2 జోరు మాములుగా లేదు. అందుకే ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ ఎఫ్ 2 కే వంగి సలాం కొడుతున్నాయి. 

F2 Creates Sensation at Box Office:

Varun and Venki F2 in 100 Crores Club
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs