Advertisement
Google Ads BL

నిఖిల్‌పై ఈ ఆరోపణలు నిజమేనా?


ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్, నిర్మాత నట్టికుమార్ కి మధ్యన టైటిల్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. తన సినిమా టైటిల్ ముద్రని నిర్మాత నట్టికుమార్ తమ సినిమా ముద్రగా విడుదల చేశాడంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు. నిఖిల్ చేసిన రచ్చ వ్యాఖ్యలకు నిర్మాత నట్టికుమార్ అగ్గి మీద గుగ్గిలం అవడమే కాదు..... ఈ రోజు నిఖిల్ గనక తమకి క్షమాపణ చెప్పకపోతే... నిఖిల్ భాగోతాలను బయటపెడతా అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. తమ సినిమా  ఐదారేళ్లు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమా అని... నానా కష్టాలు పడి విడుదల చేస్తే.. ఆ సినిమాను నువ్వు ఆపాలని ప్రయత్నం చేస్తున్నావ్. అంటే నీది కుర్రతనమా లేదంటే తాగిన మైకమా అంటూ నట్టి కుమార్ నిఖిల్ ని చెడా మడా కడిగేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ముద్ర టైటిల్ తో జరుగుతున్న ఈ వివాదం కాస్తా నిఖిల్ మెడకు చుట్టుకునేలా కనబడుతుంది. ఎందుకంటే నిఖిల్ కూడా తీవ్ర స్థాయిలో ముద్ర టైటిల్ పై నిర్మాత నట్టికుమార్ ని కెలికేశాడు. అసలే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నట్టికుమార్ మాత్రం నిఖిల్ ని వదలనంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. నిఖిల్ నా సినిమాకు తీరని నష్టం చేశాడని....ఇంకా ఎక్కువ మాట్లాడితే నిఖిల్ గోవాలో చేసే భాగోతం ఫొటోలు తన దగ్గర ఉందని వాటిని రిలీజ్ చేయాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా హీరో నిఖిల్ వలన చాలామంది నిర్మాతలు నష్టపోయారని.... చెబుతున్నాడు.

అసలెందుకు నువ్వు ప్రస్తుతం నటించిన ముద్ర సినిమా నిర్మాతలే సర్వనాశనం అయ్యారనడానికి గొప్ప ఉదాహరణ అని నట్టికుమార్, నిఖిల్ ని కడిగేస్తున్నాడు. మరి నిజంగానే ముద్ర సినిమా షూటింగ్ గత ఏడాదే కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. ఇంతవరకు విడుదల తేదీలు మార్చుకుంటూ.. ఇంకా విడుదల డేట్ ప్రకటించుకోలేదు. ఈలోపు నట్టికుమార్ ముద్ర టైటిల్ వ్యవహారం తెరమీదకి వచ్చి నానా రభస జరుగుతుంది.

Natti Kumar Fires on Nikhil Mudra Team:

Natti Kumar Latest Interview Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs