Advertisement
Google Ads BL

యంగ్‌డైరెక్టర్స్‌ ని నమ్ముకుంటే కొంపముంచారు


సినిమా అంటేనే సెంటిమెంట్స్‌ మీద నడిచే కోట్లాది రూపాయలతో చేసే జూదంగా మారింది. ముఖ్యంగా చాలా మంది యంగ్‌డైరెక్టర్స్‌ ద్వితీయ విఘ్నాలను దాటలేకపోతున్నారు. కానీ రాజమౌళి, కొరటాల శివ, అనిల్‌రావిపూడి వంటి కొందరు మాత్రమే దీనిని అధిగమిస్తున్నారు. దర్శకులం కావాలనే కోరికతో తమకు నచ్చిన కథను ఎంతో కాలం మెరుగులు దిద్దుతు, ఎక్కువ సమయంలో, శ్రద్ద చూపడం వల్ల మొదటి చిత్రాలు విజయం సాధిస్తాయి. కానీ అలా మొదటి చిత్రం మీద చూపిన శ్రద్ద, వెచ్చించిన సమయంలో రెండో చిత్రాల విషయంలో విస్మరిస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా తన మొదటి చిత్రం ‘ఘాజీ’తో అందరినీ మెప్పించిన సంకల్ప్‌రెడ్డి రెండో చిత్రంగా వరుణ్‌తేజ్‌తో ‘అంతరిక్షం’ తీసి డిజాస్టర్‌ని ఎదుర్కొన్నాడు. జనాలకు సుక్కు తరహాలో సైన్స్‌ చెప్పడం తప్ప ఎమోషన్స్‌పై దృష్టి పెట్టలేదు. ఏదో వరుణ్‌తేజ్‌కి వెంటనే ‘ఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వరుణ్‌ కూడా ఇబ్బందిపడేవాడే. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు వచ్చింది. ఎంతో సెన్సిబుల్‌గా ‘తొలిప్రేమ’ని తీసి హిట్‌ కొట్టాడు. ఈ మూవీ మ్యూజికల్‌గానే కాదు... అన్ని విధాలుగా మెప్పించేలా చేయగలిగాడు. 

కానీ ఆయన తాజాగా అక్కినేని అఖిల్‌తో తీసిన ‘మిస్టర్‌ మజ్ను’ తొలి షోతోనే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పటికే ‘అఖిల్‌’తో లాంచ్‌ వన్‌, ‘హాలో’ తో రీలాంచ్‌ మూవీలు కూడా హిట్‌ కాకపోవడం, ఇప్పుడు మరో రీలాంచ్‌ మూవీగా‘మిస్టర్‌ మజ్ను’ కూడా నిరాశపరచడం అఖిల్‌కి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందురు పారితోషికం ఇచ్చి ఆమె ఇందులో నటించిందా? అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈమె నాగచైతన్యతో నటించిన ‘సవ్యసాచి’, ఇప్పుడు తమ్ముడు అఖిల్‌కి జోడీగా నటించిన ‘మిస్టర్‌ మజ్ను’ రెండూ ఫ్లాప్‌ అయ్యాయి. మొత్తానికి మరో రీలాంచ్‌ కోసం అఖిల్‌కి ఎదురుచూపులు తప్పవనే చెప్పాలి. 

Young Heroes Gets Flops With Young Directors:

Varun Tej And Akhil Gets Flops With Young Directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs