Advertisement
Google Ads BL

రవితేజ వర్సెస్ సమంత..!


మాస్ మహారాజా రవితేజ, స్వీట్ హీరోయిన్ సమంత. ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు, ఇకపై నటిస్తారో లేదో కూడా తెలియదు. మరి అలాంటప్పుడు ఈ ఇద్దరి నడుమ వర్సెస్ గోల ఎందుకొచ్చింది అనుకొంటున్నారా. అలాగని ఇద్దరు నటించిన సినిమాలు ఏవైనా ఒకేరోజు విడుదలవుతున్నాయేమో అనుకోకండి. ఇక్కడ విషయం ఏంటంటే.. సమంత తనకు బాగా ఇష్టమైన నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సమంత 70 ఏళ్ల అమ్మమ్మగా కనిపించనుంది. ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రవితేజ మొన్న ఎనౌన్స్ చేసిన డిస్కో రాజా కాన్సెప్ట్ కూడా ఈ తరహాదే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ముసలివాడైన డిస్కో రాజా.. మళ్ళీ తన యవ్వనంలోకి అడుగిడి తాను కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందడంతోపాటు తన సమస్యలను ఎలా తీర్చుకున్నాడు అనేది రవితేజ సినిమా బేసిక్ కాన్సెప్ట్. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో వస్తున్నాయి అని తెలిసిన తర్వాత రవితేజ కంటే ఎక్కువగా సమంత టెన్షన్ పడుతోంది. కారణం ఏంటంటే.. రవితేజకీ ఉన్నంత రీచ్ సమంతకు ఉండదు. అందువల్ల ఒకవేళ రవితేజ గనుక మొదట తన సినిమాను రిలీజ్ చేస్తే ఆ తర్వాత వచ్చే సేమ్ కాన్సెప్ట్ ఫిలిమ్ అయిన తన సినిమాను ఎవరూ పట్టించుకోరు అనే భయం మొదలైంది. అందుకే తన చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను విడుదల చేయించాలని ప్లాన్ మార్చిందట. 

ఈ ఇద్దరు నడుమ పోటీ అనేది మంచిదే అయినప్పటికీ.. ఏదో కథలు కొరవడినట్లు ఇద్దరూ ఒకే కథను పట్టుకొని పోటీపడడం అనేదే రుచించడం లేదు. మరి ఈ ఇద్దరి సినిమాల్లో ఎవరి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.

Raviteja Versus Samantha :

Raviteja and samantha Fighting for same concept
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs