అఖిల్ తాను నటిస్తున్న సినిమాలను సరిగా విడుదల చేయించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదో లేక తనకు సినిమాలు అచ్చిరావడం లేదో లేక పరిచయ చిత్రం మొదలుకొని మొన్న విడుదలైన మిస్టర్ మజ్ను వరకూ అన్నీ ఫ్లాప్ సినిమాలుగానే మిగిలిపోతున్నాయి. అఖిల్ లాంటి డిజాస్టర్ సినిమా కూడా మొదటి రోజు 7 కోట్లు వసూలు చేసింది, ఇక హలోకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా నానితో పోటీపడడం వల్ల కమర్షియల్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక మూడో చిత్రం మిస్టర్ మజ్నుకి సోలో రిలీజ్ దొరికినప్పటికీ.. అఖిల్ టైమ్ బాగోకపోవడం వల్ల లాంగ్ వీకెండ్ లో కూడా వరల్డ్ వైడ్ గా కనీసం 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని 3 కోట్ల రూపాయలకు కొనగా ఇప్పటివరకూ కనీసం పావు వంతు కూడా రాబట్టలేకపోవడంతో అక్కడ ఆల్రెడీ డిజాస్టర్ గా డిక్లేర్ చేసేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి కనిపిస్తోంది. 22 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినస్ జరగగా.. ఇప్పటివరకూ కనీసం సగం కూడా రాలేదు. ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ అంటూ టీం మెంబర్స్ అందరూ థియేటర్ విజిటింగ్స్ మొదలెట్టినప్పటికీ.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
దాంతో నాగార్జున ఇమ్మీడియట్ గా అఖిల్ నాలుగో సినిమాను ప్లాన్ చేయడంపై దృష్టి సారించాడు. నాగచైతన్య తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ కాకపోయినా కనీసం నటుడిగా గుర్తింపైనా సంపాదించుకున్నాడు. అఖిల్ కి మాత్రం ఇప్పటివరకూ ఎంత భారీగా ప్లాన్ చేసినా ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే ఈసారి ప్రేమకథ కాకుండా ఏదైనా మాస్ సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. ఎలాగూ ఫైట్స్ లో అఖిల్ కి స్పెషల్ ట్రయినింగ్ ఉంది కాబట్టి.. దాన్ని బేస్ చేసుకొని ఒక యాక్షన్ ఫిలిమ్ ను తెరకెక్కించి అఖిల్ ను హీరోగా సెటిల్ చేసే పనిలో పడ్డాడు నాగ్.