Advertisement
Google Ads BL

శ్రుతిహాసన్ కొత్త ప్రయత్నం సక్సెస్ అవుతుందా?


సినిమాల్లోకి వచ్చాక తన సింగింగ్ టాలెంట్ ను పక్కన పెట్టేసింది కానీ.. ఒక నటిగా సక్సెస్ అవ్వడానికంటే ముందు శ్రుతి ఒక అద్భుతమైన సింగర్. ఈనాడు, రేసుగుర్రం లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు విని ఖచ్చితంగా ఈమె పెద్ద రాక్ స్టార్ అవుతుంది అనుకున్నారందరూ. నిజానికి శ్రుతిహాసన్ డ్రీమ్ కూడా అదే. సొంతంగా ఒక రాక్ బ్యాండ్ ను ఫార్మ్ చేసి.. దేశవిదేశాల్లో టూర్స్ ప్లాన్ చేసి తన పాటలతో శ్రోతలను మెస్మరైజ్ చేయాలనేది ఆమె కోరిక. కానీ.. సినిమాలోకి రావడం, వెంటనే కాకపోయినా కొన్ని ప్రయత్నాల తర్వాత సక్సెస్ అవ్వడంతో తన సింగింగ్ టాలెంట్ ను పక్కన పెట్టేసి సినిమాలపై దృష్టిసారించింది. 

Advertisement
CJ Advs

మరి సినిమాలంటే బోర్ కొట్టిందో లేక ఇకపై సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యిందో తెలియదు కానీ.. కాటమరాయుడు అనంతరం శ్రుతిహాసన్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. ఆ తర్వాత జాన్ అబ్రహాంతో ఒక హిందీ సినిమా సైన్ చేసినప్పటికీ అనంతరం ఆ సినిమా నుంచి కూడా తప్పుకొందని వార్తలొచ్చాయి. ఇక తన లండన్ బోయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందేమోననుకున్నారందరూ. కానీ.. ఆమె డ్రీమ్ ప్రొజెక్ట్ పై వర్క్ చేయడం మొదలెట్టింది. 

తన బోయ్ ఫ్రెండ్ హెల్ప్ తో సొంతంగ ఒక బ్యాండ్ ఫార్మ్ చేసుకుంది. త్వరలోనే ఒక కాన్సర్ట్ కు రెడీ అవుతోంది శ్రుతిహాసన్. ఆ కాన్సర్ట్ లో ప్లే చేయబోయే పాటలన్నీ శ్రుతిహాసన్ ట్యూన్ చేయడమే కాక రాయడం విశేషం. ఈ కాన్సర్ట్ గనుక సక్సెస్ అయితే.. శ్రుతి ఇకపై వరుసగా స్టేజ్ షోస్ మరియు కాన్సర్ట్స్ ప్లాన్ చేస్తోంది. సో, శ్రుతి ఇకపై వెండితెరపై కనిపించడం గగనమే అనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. 

Shruti Haasan all set to start new career as singer:

After her downfall as an actress shruti haasan is all set to achieve her dream as a singer 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs