Advertisement
Google Ads BL

డైరెక్టర్ క్రిష్ భగ్గుమన్నాడు..!


కంగనా - క్రిష్ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది. మణికర్ణిక విషయంలో క్రిష్ కి కంగనాకు మధ్యన వచ్చిన విభేదాలు.... కంగనా వెర్షన్ లో కంగనాది విన్నాం. కానీ మణికర్ణిక విడుదలై ఇప్పుడు సినిమా హిట్ కొట్టకపోయినా కంగనా దర్శకత్వం, నటన గురించి బాలీవుడ్ పొగడ్తలతో ముంచెత్తుతుంది. మరి అది చూసి భరించలేని క్రిష్..... ఇప్పటివరకు మణికర్ణిక విషయంలో ఫుల్ గా ఓపెన్ అవని క్రిష్ కొత్తగా కంగనాపై చిందులు తొక్కుతున్నాడు. దర్శకత్వం పక్కన తనపేరుతో పాటుగా కంగనా పేరు ఎందుకు చేరిందో పూసగుచ్చినట్టుగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కథలు కథలుగా చెప్పుకొచ్చాడు క్రిష్. 

Advertisement
CJ Advs

సినిమా మొత్తం గత జూన్ చివరికల్లా తానే డైరెక్ట్ చేసి మరీ అన్ని క్యారెక్టర్స్ చేత డబ్బింగ్ కూడా చెప్పించానని.. కానీ కంగనా మాత్రం వేరే సినిమా షూటింగ్ లో ఉండి తన పాత్రకి డబ్బింగ్ చెప్పలేదని.. కానీ లండన్ నుండి కంగనా తిరిగి వచ్చాక సినిమా చూసి తనకు నచ్చిందని చెప్పారు. కానీ కొన్ని చిన్న మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారు. ఆ తర్వాత కంగనా సినిమాలో ఇది మార్చండి, అది మార్చండి అంటూ చెప్పడమే కాకుండా.... చివరకు రీషూట్స్ పెట్టామని చెప్పిందట. అంతేకాకుండా మణికర్ణికలో నేను తెరకెక్కించిన సన్నివేశాలు మణికర్ణిక నిర్మాతకు నచ్చలేదని.... సినిమా మొత్తం భోజ్‌పురి సినిమా ఉందని కంగనా నాకు ఫోన్‌ చేసి చెప్పింది. నేనేమీ మాట్లాడకుండా నవ్వాను. నా సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఇంతకుముందే తెలుసు. నేను ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆ ఫోన్ కాల్ లోనే కంగనా నాతో చాలా దురుసుగా మాట్లాడిందని చెప్పాడు.

ఇక సినిమా మొత్తం నేనే డైరెక్ట్ చేసినా.. ఆమె పేరు దర్శకత్వం పక్కన ఎలా వేసుకుందో తెలియడం లేదని.. నేను బయటికి రావడం సోను సూద్ కి ఇష్టం లేక.. ఆయన కూడా బయటికొచ్చేయడంతో... మళ్ళీ సినిమాలో చాలా సీన్స్ రీ షూట్స్ చేశారని చెబుతున్నాడు క్రిష్. సోను సూద్ క్యారెక్టర్ ని కంగనా 100 నిమిషాల నుండి 70 నిమిషాలకు కుదించమని చెప్పడమే కాకుండా ఇంటర్వెల్ లోనే సోను పాత్ర ముగించమని చెప్పడంతో అదంతా ఇష్టం లేకనే మణికర్ణిక నుండి తప్పుకున్నాడట క్రిష్. అలాగే మణికర్ణిక నిర్మాతలు  జీ-స్టూడియోస్‌ వారితో కూడా మాట్లాడడం మానేశానని చెబుతున్న క్రిష్ కి ఇవ్వాల్సిన పారితోషికంలో 30 మాత్రమే ఇచ్చారట.  అయితే ఏదోక రోజు మిగతా బాలెన్స్‌ వస్తుందని క్రిష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Manikarnika: Is Krish jealous or hurt?:

Krish Serious Claims On Manikarnika  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs