Advertisement
Google Ads BL

దర్శకులిద్దరూ రెండుని రీచ్ కాలేకపోయారు


ఇతర ఇండస్ట్రీస్ లో ఏమో కానీ మన టాలీవుడ్ లో ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. మొదటి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రెండో సినిమాతో హిట్ అందుకోవడం కష్టమే అని చాలాసార్లు రుజువైంది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తప్ప. రీసెంట్ గా ఇద్దరు డైరెక్టర్స్ కి ఈ సెంటిమెంట్ ఎదురైంది. సంక‌ల్ప్‌రెడ్డి, వెంకీ అట్లూరి.

Advertisement
CJ Advs

రానాతో ఘాజి లాంటి నేషనల్ అవార్డు మూవీ తీసిన సంకల్ప్ రెడ్డి రెండో సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు. మొదటి సినిమాతో అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని, ఇటు రివార్డుల్నీ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు సంకల్ప్. కానీ అతను తీసిన రెండో సినిమా ‘అంత‌రిక్షం’ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో తొలి స్పేస్ చిత్రం కాబట్టి అంద‌రి దృష్టీ అటువైపు ప‌డింది. కానీ.. ‘అంత‌రిక్షం’ అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేదు.

అలానే వరుణ్ తేజ్ తో తొలిప్రేమ లాంటి ఫీల్ గుడ్ స్టోరీని తీసిన వెంకీ అట్లూరి రెండో సినిమాతో ఫెయిల్ అయ్యాడు. అఖిల్ కెరీర్ కు చాలా అవసరం అయినా మిస్టర్ మజ్ను సినిమా గత వారం రిలీజ్ అయింది. రొటీన్ క‌థ‌తో మెప్పిద్దామ‌ని ప్ర‌య‌త్నించి భంగ ప‌డ్డాడు వెంకీ. దాంతో అతనికి ఈ సెంటిమెంట్ ను ఎదురుకోవడం తప్పలేదు. సినిమా తీస్తున్నప్పుడు ఎన్నో అనుకుంటారు కానీ రిజల్ట్ వచ్చాక వేరేగా ఉంటుంది. కొన్ని సార్లు హిట్ అవుతుంటాయి.. కొన్నికొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఒకటికి రెండు సార్లు కథపై శ్రద్ద పెడితే సినిమా ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలా కాదని తీస్తే ఇలానే ఉంటుంది.

Young Director Failed with Second Movies:

Sankalp Reddy and Venky Atluri not Reached Second Film Sentiment 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs