Advertisement
Google Ads BL

చంద్రబాబు బయోపిక్ ఆడియో ఎప్పుడంటే?


జనవరి 31న చంద్రోదయం బయోపిక్ ఆడియో 

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రోదయం’. పి . వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ అండ్  శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది . ఇప్పటికే రాంగోపాల్ వర్మ వెన్నుపోటు పాటకు వ్యతిరేకంగా రిలీజ్ చేసిన పాటతో సంచలనం సృష్టించిన దర్శకుడు పి . వెంకట రమణ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ... చంద్రబాబు నాయుడు భారతదేశం గర్వించదగ్గ నాయకుడని , అపారమైన తన మేథా సంపత్తితో ఆంధ్రప్రదేశ్ ని అగ్ర పథాన నిలిపాడని , 68 ఏళ్ల వయసులోనూ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని అందుకే అలాంటి మహానుభావుడి కష్టం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళకు తెలియజేయడానికే ఈ చంద్రోదయం చిత్రాన్ని రూపొందిస్తున్నామని ... చంద్రబాబు బయోపిక్ ఎందుకు తీస్తున్నావని అడిగే వాళ్లకు మా చంద్రోదయం సరైన సమాధానం చెబుతుందని,  ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 31న నిర్వహించనున్నామన్నారు. 

చిత్ర నిర్మాత జి జె రాజేంద్ర మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడి బయోపిక్ తీసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాని విడుదల చేస్తామన్నారు . 

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

Chandrodayam Movie Audio Release Date fix:

Chandrababu Biopic Chandrodayam Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs