Advertisement
Google Ads BL

రవితేజ వెనక్కి తగ్గాడు.. ఫ్యాన్స్ హ్యాపీ!


మాస్‌ మహారాజా అంటే రవితేజ అనే చెప్పాలి. ఆయన తనదైన శైలిలో చేసే యాక్టింగ్‌ ప్రేక్షకులకు భలే కిక్‌ ఇస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఫిల్మ్‌బ్యాగ్రౌండ్‌ లేకుండా పైకి ఎదిగిన వారిలో చిరంజీవి తర్వాత రవితేజ పేరు చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో నాని, విజయ్‌దేవరకొండ వంటి పలువురికి ఆయన ఆదర్శం అనే చెప్పాలి. ఇక కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ తరహా పాత్రలు చేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ, ‘సింధూరం, ఖడ్గం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి చిత్రాలతో తనకంటూ స్టార్‌ స్టేటస్‌ సాధించుకున్నాడు. ఈయన కెరీర్‌లో ‘కిక్‌’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌ మాత్రమే కాదు.. నిన్న మొన్నటి వరకు ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తూ, జయాపజయాలకు అతీతంగా తనకంటూ మార్కెట్‌ని ఏర్పరచుకున్నాడు. 

Advertisement
CJ Advs

కానీ గత కొంతకాలంగా ఆయనలో ముసలితనం, వయసు ప్రభావం ఛాయలు బాగా కనిపించడమే కాదు.. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. పవన్‌ వంటి వాడే రవితేజని చూస్తే తనకి ఈర్ష్యగా ఉంటుందని, ఆయన అంత సిగ్గుపడకుండా ఎలా చేస్తాడో? అని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. ఇక ఈయన పారితోషికం విషయంలో మాత్రం పట్టుదిగడనే విషయాన్ని అందరు ఒప్పుకుంటారు. దానివల్ల ఆమధ్య లాంగ్‌ గ్యాప్‌లో ఆయన ఎన్నో చిత్రాలు వదులుకున్నాడని వార్తలు వచ్చాయి. చివరకు దిల్‌రాజుకి, ఆయనకి పారితోషికం విషయంలో తేడాలు రావడంతో ఆ చిత్రం జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఎవరు మెట్టుదిగారో తెలియదు గానీ మరలా ‘రాజా ది గ్రేట్‌’తో దిల్‌రాజుతోనే హిట్‌ కొట్టాడు. 

ఇక తాజాగా ఈయన నటించిన ‘టచ్‌ చేసి చూడు, నేలటిక్కెట్‌, అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయినా రవితేజ మాత్రం పడిపోయిన తన మార్కెట్‌ని పట్టించుకోకుండా పాతకాలం నాటి రెమ్యూనరేషన్‌ కోసమే పట్టుబడుతూ ఉండటంతో రామ్‌తాళ్లూరి నిర్మాతగా ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వి.ఐ.ఆనంద్‌ చిత్రానికి కూడా నో చెప్పడంతోనే జాప్యం జరుగుతోందని, ఇదే సమయంలో ఇక ఆయన మైత్రిమూవీమేకర్స్‌ బేనర్‌లో సంతోష్‌ శ్రీనివాస్‌ చిత్రంతోనే సరిపెట్టుకుంటాడని వార్తలు వచ్చాయి. మొత్తానికి కథ సుఖాంతం అయింది. అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ పారితోషికం విషయంలో ఓ మెట్టు దిగడంతో విఐ ఆనంద్‌ - రామ్‌ తాళ్లూరిల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఇది మాస్‌ మహారాజా రవితేజ అభిమానులకు కిక్‌ ఇచ్చే విషయమేనని చెప్పాలి. 

Raviteja and VI Anand Movie on Cards:

Raviteja DiscoRaja Movie background Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs