Advertisement
Google Ads BL

ఏ దర్శకుడైనా సరే.. మహేష్ నిర్ణయమిదే?


సాధారణంగా హీరోలు కథ విన్నాక పూర్తి కథ ఉంటేనే సినిమా చేస్తారు. లేకపోతే చేయరు. కానీ కొంతమంది హీరోలు దర్శకులకి ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ చూసి, లేదా అతనితో ఇంతకుముందు పని చేసిన అనుభవాన్ని గుర్తుంచుకుని మరో చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలానే మహేష్ బాబు ఇద్దరి దర్శకులకి అవకాశం ఇచ్చి ఫెయిల్ అయ్యాడు.

Advertisement
CJ Advs

మహేష్ బాబు - వెంకీని పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకంతో ‘బ్రహ్మోత్సవం’ చేసాడు. అది డిజాస్టర్ అయింది. అలానే మురుగదాస్‌ ట్రాక్‌ రికార్డ్‌ని నమ్మి ‘స్పైడర్‌’ చేస్తే అతను నిలువునా ముంచాడు. అందుకే ఇలా కాదని పూర్తిగా కథ నమ్ముకుందాం అని డిసైడ్ అయ్యాడు. బౌండ్‌ స్క్రిప్ట్‌ లేకుండా ఏ సినిమా స్టార్ట్‌ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడు.

అందుకే ‘మహర్షి’ సినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి కారణం. ఈ సినిమాపై వంశీ పైడిపల్లి దాదాపు ఏడాదిపైనే వర్క్ చేసాడు. అలానే మహర్షి తరువాత చేసే సుకుమార్ సినిమాకు సంబంధించి బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే సినిమా మొదలు పెడదామని తేల్చేసాడు. తొందరపడి ఏ సినిమాను స్టార్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాడు. బౌండెడ్ స్క్రిప్ట్‌తో ఎవరు ముందుకు వస్తే వారితో సినిమా చేస్తా అంటున్నాడట మహేష్.

Mahesh Babu Takes Sensational Decision:

Super Star Wants From Directors To Come with Full Bounded Script
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs