Advertisement
Google Ads BL

క్రిష్‌కు అస్సలు క్రెడిట్ ఇవ్వడం లేదుగా?


క్రిష్ తెలుగులో మంచి దర్శకుడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ బాలీవుడ్‌లో కంగానాని పెట్టి మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే కంగనాతో వచ్చిన విభేదాలతో క్రిష్.. మణికర్ణిక నుండి బయటికొచ్చేసాడు. క్రిష్ వెనుక సోనూసూద్ కూడా సినిమా నుండి తప్పుకోవడంతో.. కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాని మధ్యలో వదిలెయ్యకుండా పూర్తి చేసి చివరికి రిపబ్లిక్ డే కానుకగా ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. కంగనా నటనకు, ఆమె డైరెక్షన్‌కి ప్రముఖులు నీరాజనాలు పడుతున్నారు. అయితే క్రిష్ 70 శాతం, కంగనా ముప్పై శాతం దర్శకత్వం వహించిన మణికర్ణిక సినిమా ట్రైలర్ విడుదలప్పుడు క్రిష్ ని డైరెక్టర్ గా కంగనాని రెండో డైరెక్టర్‌గా టైటిల్ కార్డ్స్‌లో వేశారు.

Advertisement
CJ Advs

ఇక తర్వాతర్వాత కంగనా మణికర్ణికలో మేజర్ క్రెడిట్ తనదేనంటూ స్పీచులివ్వడం, క్రిష్‌కి క్రెడిట్ దక్కకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. క్రిష్ కూడా మణికర్ణిక విషయంలో సైలెంట్ గా ఉండి.. కథానాయకుడు ఇంటర్వూస్ లో కంగనా గురించి మాట్లాడకుండా మణికర్ణిక టీం చరిత్రను వక్రీకరించిందంటూ మణికర్ణిక మీద నెగెటివ్ వ్యాఖ్యలు చేసాడు. సోనూసూద్ మాత్రం చారిత్రాత్మక చిత్రం నుండి బయటికొచ్చి తప్పు చేశాడన్నారు. ఇక తాజాగా విడుదలైన మణికర్ణిక సినిమాపై బాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజాలు కూడా మణికర్ణిక అంత బాగా రావడానికి కంగనానే కారణమంటున్నారు.

ఎక్కడా వారు క్రిష్ పేరు ఉచ్చరించడం లేదు. క్రిష్ పేరు తియ్యకుండా మణికర్ణిక హిట్ క్రెడిట్ మొత్తం కంగనాకు ఆపాదిస్తున్నారు ప్రముఖులు. మరి క్రిష్, కంగనాతో పడకే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ.. కంగనా మాత్రం సినిమాని వదలకుండా పూర్తి చేసినందుకు.. క్రిష్ మధ్యలో వదిలేసినందుకు చాలామంది విమర్శించారు. అందుకే ఇప్పుడు సినిమా విడుదలయ్యాక క్రిష్‌కి ఎలాంటి క్రెడిట్ దక్కకుండా కంగనా జాగ్రత్తపడడం కాదు.. బాలీవుడ్ మొత్తం ఏకమై కంగనాని హీరోని చేసి క్రిష్‌ని తొక్కేశారు. పాపం మణికర్ణిక విషయంలో క్రిష్ తప్పు ఎంతవరకు ఉందో చెప్పలేం కానీ.. క్రిష్ మాత్రం బాలీవుడ్ వర్గాల చేతుల్లో బాగా బుక్కయ్యాడు.

Kangana Ranaut Takes Full Credit of Manikarnika Success:

No Krish at Manikarnika Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs