Advertisement
Google Ads BL

‘మిస్టర్ మజ్ను’ రిజల్ట్‌పై టీమ్ రెస్పాన్స్ ఇదే..


థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూస్తుంటే మజ్ను టైటిల్‌కి జస్టిఫై చేశాననుకుంటున్నాను - అఖిల్‌ అక్కినేని 

Advertisement
CJ Advs

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన యూత్‌పుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. జనవరి 25న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్‌ కేక్‌ కటింగ్‌తో సెలబ్రేట్‌ చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో .... 

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘దేవి థియేటర్‌లో సినిమాను ఆడియెన్స్‌తో కలిసి చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం చేయాలని మిస్టర్‌ మజ్ను సినిమా చేశాను. ఈ సినిమా విడుదలైన తర్వాత అన్ని పాజిటివ్‌ వైబ్స్‌ కనపడుతున్నాయి. తమన్‌ మ్యూజిక్‌ చాలా బావుంది. తనను తాను అప్‌డేట్‌ చేసుకుంటున్నాడు. వెంకీ కరెక్ట్‌ సబ్జెక్ట్‌ను పిక్‌ చేసి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నవీన్‌ నూలి బ్లాక్‌బస్టర్‌ ఎడిటర్‌ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. నిర్మాత బివిఎస్‌ఎన్‌. ప్రసాద్‌గారు గాడ్‌ఫాదర్‌లా ఈసినిమాను ముందుండి నడిపించారు. మా తాతగారితో పనిచేసిన ఆయనతో నేను సినిమా చేయడం హ్యాపీ. అలాగే తెర వెనుక ఉండి సపోర్ట్‌ చేసిన బాపినీడుకి థాంక్స్‌. నిధి ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్‌ చేసింది. ఏడెనిమిది నెలల కష్టానికి తగ్గ ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీకి మజ్ను టైటిల్‌ చాలా ఇంపార్టెంట్‌. నేను ఆ టైటిల్‌కు జస్టిఫికేషన్‌ చేశానని అనుకుంటున్నాను. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్షన్‌ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది’’ అన్నారు. 

నిర్మాత బివిఎస్‌ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మజ్ను సినిమాకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. సినిమా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అక్కినేని అభిమానుల నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సినిమా చూసి ఫ్యాన్స్‌ డ్యాన్స్‌ వేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావుగారికి మజ్ను పెద్ద మైలురాయిలా నిలిచింది. అలాగే నాగార్జునగారికి కూడా మజ్ను మైలురాయిలా నిలిచింది. ఇప్పుడు అఖిల్‌ కూడా అదే తరహాలో మిస్టర్‌మజ్నుతో భారీ హిట్‌ సాధించాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో అఖిల్‌తో మరో సినిమా చేస్తాను’’ అన్నారు. 

డైరెక్టర్‌ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుండి అందరూ సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. అందరికీ థాంక్స్‌. పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దర్శకుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారికి థాంక్స్‌. థమన్‌ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. తనకు థాంక్స్‌. సీరియస్‌ ఇష్యూని ఓ కామిక్‌ వేలో ప్రజెంట్‌ చేద్దామని పైరసీ సీన్స్‌ను హైపర్‌ ఆదితో చేశాం. దానికి మంచి స్పందన వస్తుంది. చివరలో దానికి తగ్గ జస్టిఫికేషన్‌ కూడా ఇచ్చాం. అలాగే సెకండాఫ్‌లో కొండబాబు క్యారెక్టర్‌ను కామిక్‌గా చూపించాం. దానికి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’’ అన్నారు. 

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. అఖిల్‌ చాలా మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. అందరూ ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌’’ అన్నారు. 

సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదల రోజంటే అందరికీ టెస్టింగ్‌ డే. ముందు పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు సినిమా కూడా చాలా సూపర్‌హిట్‌ అయ్యింది. మా నిర్మాత ప్రసాద్‌గారు దగ్గరుండి తన సినిమాలకి మంచి మ్యూజిక్‌ చేయించుకుంటారు. ‘తొలిప్రేమ’ తర్వాత వెంకీతో కలిసి చేయడం ఆనందంగా ఉంది. వెంకీ మంచి క్వాలిటీ కోసం ఎదురుచూస్తాడు. ఈ సినిమా తర్వాత నాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మంచి లిరిక్స్‌ ఇచ్చిన శ్రీమణిగారికి థాంక్స్‌. జార్జ్‌ ఫోటోగ్రఫీ చాలా బావుంది. అఖిల్‌ చాలా ఎనర్జీతో నటించాడు. తన ఎనర్జీని మ్యాచ్‌ చేస్తూ నిధి నటించింది. సినిమా సక్సెస్‌ చేసిన అభిమానులకు థాంక్స్‌’’ అన్నారు. 

Mr Majnu Thanks Meet Details:

Mr Majnu Movie Team Celebrates Movie Success 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs