గత ఏడాది గీత గోవిందం సినిమా ఎన్ని రికార్డులను, ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. ఆ సినిమా థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కూడా నాన్ బాహుబలి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక గీత గోవిందం హావలో ఇప్పుడు మరో పెద్ద సినిమా కెవ్వుమంది. అది గత ఏడాది ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అరవింద సమేత దసరా కానుకగా విడుదలై యావరేజ్ హిట్ గా నిలిచింది. సినిమా టాక్ బావున్నప్పటికీ. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి. కలెక్షన్స్ భారీగా మాత్రం రాలేదు. కాకపోతే బయ్యర్లకు నష్టాలు మిగల్చలేదు కానీ.. సినీమా మాత్రం యావరేజ్ అయ్యింది. అయితే తాజాగా అరవింద్ సమేత శాటిలైట్ హక్కులు కొన్న జీ ఛానల్ వారు సంక్రాతి కానుకగా తమ ఛానల్ లో అరవింద సమేత ని ప్రసారం చేసింది.
అయితే అరవిందకి బుల్లితెర మీద భారీ టిఆర్పి రేటింగ్స్ వస్తుందనుకున్నవారికి భారీ షాక్ తగిలింది. చాలా పూర్ రేటింగ్స్ ని అరవింద సమేత సొంతం చేసింది. కేవలం 13.7 రేటింగ్ తోనే అరవింద సమేత సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే గీత గోవిందం సినిమ అయితే మొదటిసారి జీ ఛానల్ లో ప్రసారం అయినప్పుడు 20 టీఆర్పీ రేటింగ్ ని.. సెకండ్ టైం ప్రసారం అయినప్పుడు 17 రేటింగ్ ని గీత గోవిందం సొంతం చేసుకుంది. మరి ఎన్టీఆర్ కూడా విజయ్ ముందు ఈ టీఆర్పీ రేటింగ్స్ లో కొట్టుకుపోయాడు. థియేటర్స్ లోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయిన అరవింద సమేత బుల్లితెర మీద కూడా వెలవెలబోయింది.