Advertisement
Google Ads BL

అలీ దెబ్బకు సుమ విలవిల..!


జన్మతహ: మలయాళీ అయిన యాంకర్‌, నటి సుమ తెలుగు కూడా అద్భుతంగా మాట్లాడుతుంది. సందర్భోచితంగా, సమయస్ఫూర్తితో ఆమె వేసే సెటైర్లకు మంత్రముగ్దులు కాని తెలుగు వారు ఉండరు. బుల్లితెరపైనే కాదు... సినిమా వేడుకల్లో కూడా ఆమె తనదైన వాక్చాతుర్యంతో గలగల నాన్‌స్టాప్‌గా మాట్లాడేస్తూ ఉంటుంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్లతో సరిసమానమైన ఫాలోయింగ్‌ ఈమెకి ఉందంటే అతిశయోక్తి లేదు. ఈమె వేసే సెటైర్లకు సమాధానం చెప్పలేక మౌనంగా నవ్వుతూ ఉండిపోయే వారే ఎక్కువ.

Advertisement
CJ Advs

కానీ బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఎన్నో ఏళ్లు హీరోగా, కమెడియన్‌గా రాణిస్తూ, ప్రస్తుతం బుల్లితెరపై, సినీ వేడుకల్లో కూడా కనిపిస్తున్న కమెడియన్‌ అలీని సుమతో పోల్చవచ్చు. ఈయన వేసే పంచ్‌లు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. కాకపోతే అందులో కాస్త ద్వందార్దాలు దొర్లుతూ ఉంటాయి. ఇక ఒక వేడుకలో హోస్ట్‌లుగా వ్యవహరించిన సుమపై కాస్త మోటు వ్యాఖ్యలే చేశాడు అలీ. దానికి సుమ నొచ్చుకుని అలకపాన్పు కూడా ఎక్కింది. 

ఇక తాజాగా మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్‌ లవ్‌’కి తెలుగు వెర్షన్‌ అయిన ‘లవర్స్‌డే’ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలయాళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మరోసారి అలీ, సుమలు యాంకర్లుగా వ్యవహరించారు. ఈ వేదికపై సుమ మాట్లాడుతూ, ఇందులో నటిస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అలీకి చెల్లెలి వరస అంటూ సెటైర్‌ వేసింది. మరి అలీ కూడా తక్కువ తినలేదు కదా...! వెంటనే ఇందులో హీరోగా నటిస్తున్న రోషన్‌ నీకు కొడుకు వరసా? నీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? మరి రాజీవ్‌ కనకాల కేరళకి ఎంత కాలం ముందు వెళ్లాడబ్బా? అంటూ కాస్త మోటుగానే ఎన్‌కౌంటర్‌ వేశాడు. 

పాపం.. దీంతో సుమకి ఏం సమాధానం ఇవ్వాలి? ఎదురు పంచ్‌ ఎలా ఇవ్వాలి అనేదే అర్ధం కాలేదు. మరో వైపు ఈ వేడుకు వచ్చిన మారుతి కూడా సుమపై పంచ్‌ వేశాడు. ఈ వేడుక మొత్తంలో అందరు కేరళకి చెందిన మలయాళీలే కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే మలయాళీ అయిన సుమ ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఉంది.. అనే మాటతో సుమని ఇటు అలీ, అటు మారుతికి ఉక్కిరిబిక్కిరి చేశారు. తాడిని తన్నే వాడుంటే వాడిని తలదన్నేవాడు ఉంటాడనేది అందుకే సుమా...! 

Ali Punch on Suma at Lovers Day Audio:

Strong Punches on Suma at Lovers Day Audio Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs