Advertisement
Google Ads BL

‘ఇస్మార్ట్ శంకర్’కు హీరోయిన్ క్లాప్


ఘనంగా ప్రారంభమైన రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్‌ల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం

Advertisement
CJ Advs

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం బుధవారం రోజు అధికారికంగా ప్రారంభమయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హీరోయిన్ చార్మీ కౌర్ క్లాప్ కొట్టగా, చిత్ర తొలి షాట్‌ని హీరో‌పై తెరకెక్కించారు. స్రవంతి రవికిశోర్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.. తదితరులు.

 

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్

సమర్పణ: లావణ్య

బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్

ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి 

పాటల రచయిత: భాస్కరభట్ల

ఫైట్స్ : రియల్ సతీష్

Ismart Shankar Movie Opening Details:

Ismart Shankar Movie Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs