Advertisement
Google Ads BL

అబ్బో అంతా..! RRRపై ఈ వార్త నిజమేనా?


టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్‌గా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న RRR  పై ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. నవంబర్ లో మొదలైన RRR షూటింగ్ అప్పుడే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సెకండ్ షెడ్యూల్ తో రాజమౌళి RRR  సెట్స్ పైనున్నాడు. ఇంకా హీరోయిన్స్ కూడా ఎంపిక చెయ్యని జక్కన్న RRR షూటింగ్ ని మాత్రం పరిగెత్తిస్తున్నాడు. కొడుకు కార్తికేయ పెళ్ళికి ఒక నెల గ్యాప్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు పూర్తిగా తన దృష్టిని RRR పైనే పెట్టాడు. ఇక సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియానే కాదు ఫిలింసర్కిల్స్ ని షేక్ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఆ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం RRR పై ఆ రూమర్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే రాజమౌళి RRR మూవీని బాహుబలి వలే పలు భాషల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ RRR మూవీ శాటిలైట్స్ హక్కుల కోసం పలు బడా ఛానల్స్ పోటీపడుతున్నట్లుగా.. అందులోని జీ టెలివిజన్ నెట్ వర్క్ వారు RRR తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ రైట్స్ కోసం 150 కోట్లు కోట్ చేసినట్టుగా ఒక వార్త మీడియాలోనూ, ఫిలింసర్కిల్స్ లోను షికారు చేస్తోంది.

అయితే RRR నిర్మాత డివివి దానయ్య జి నెట్ వర్క్ వారికీ ఆ రేటుకి మాటివ్వకుండా హోల్డ్ లో పెట్టినట్లుగా చెబుతున్నారు. మరి జక్కన్న సినిమాలంటే ఆ మాత్రం క్రేజుంటుంది. బాహుబలితో రాజమౌళి క్రేజ్ ఎల్లలు దాటింది. అందుకే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఈ రేంజ్ క్రేజుంది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక సినిమాలో నటించడమంటే.... ఆ సినిమా క్రేజ్ ఎలాంటిదో ఊహించడానికి అవధుల్లేవ్.

RRR First And Biggest Offer:

RRR Satellite Rights For 150 Cr
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs