Advertisement
Google Ads BL

రాజమౌళి కోసం ఇల్లు కట్టిస్తున్న దానయ్య


అదేంటి రాజమౌళికి ఆల్రెడీ అద్భుతమైన ఇల్లు ఉంది కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా దానయ్య కట్టించడం ఏమిటి? ఆర్.ఆర్.ఆర్ రెమ్యూనరేషన్ కి బదులుగా ఇల్లు ఏమైనా ఇస్తున్నాడా అనుకొంటున్నారా. ఇల్లు కట్టిస్తున్న విషయం నిజమే కానీ అది గిఫ్ట్ గానో లేక రెమ్యూనరేషన్ బదులో కాదండోయ్. మేటర్ ఏంటంటే.. రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమా ప్రీప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ఇన్వాల్వ్ అవుతారన్న విషయం తెలిసిందే. సాధారణంగా తాను తెరకెక్కించే సినిమాల విషయంలో నిదానమే ప్రదానం అనే పద్ధతిని పాటించే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో మాత్రం కాస్త స్పీడ్ పెంచాడు. అందుకే.. తాను ఇంటికి వెళ్ళి మళ్ళీ సెట్స్ కి రావడం వల్ల దాదాపు అయిదారు గంటలు వృధా అవుతుందని గ్రహించి సినిమా సెట్స్ కు దగ్గరలోనే ఒక పోర్టబుల్ హౌస్ కట్టించుకొన్నాడట. ఆ ఇంట్లోనే రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ఉండబోతున్నారు. అదే ఇంటి దగ్గరలోనే యాక్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి, స్టే కోసం కూడా రూమ్స్ ఏర్పాటు చేయిస్తున్నాడట. సినిమా మొత్తం పూర్తయ్యేవరకూ రాజమౌళి & కో అక్కడే ఉంటారట. 

Advertisement
CJ Advs

నిన్ననే సెకండ్ షెడ్యూల్ కూడా మొదలెట్టిన రాజమౌళి.. త్వరలో మరింత వేగవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలు ఏమిటనేది ఇంకా క్లారిటీ ఇవ్వని రాజమౌళి.. హీరోయిన్లను కూడా ఇంకా ఎంపిక చేయలేదు. కనీసం విలన్ ఎవరనేది కూడా తెలియదు. దాంతో అందరూ చాలా ఆత్రంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Danayya Building a House for Rajamouli:

Producer Danayya Building a new house for Rajamouli and family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs