Advertisement
Google Ads BL

30 ఏళ్ల తర్వాత రజనీ రిపీట్ చేస్తున్నాడు


మన స్టార్ హీరోలు ఎందుకనో ఒకసారి పోషించిన పాత్రను మళ్ళీ పోషించడానికి ఇష్టపడరు. ఇక రజనీకాంత్ లాంటి స్టార్ హీరో అయితే రిపిటీషన్ విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం రజనీ ఒక సినిమాలో పోలీస్ పాత్ర పోషించారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన మళ్ళీ ఇప్పటివరకూ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయలేదు. మధ్యలో చాలా పోలీస్ కథలు వచ్చినప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయలేదట. కానీ.. తన తదుపరి చిత్ర దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ నచ్చిందో లేక ఆయన క్యారెక్టర్స్ డిజైన్ చేసే విధానం నచ్చిందో తెలియదు కానీ.. 30 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ గా నటించడానికి ఒప్పుకొన్నాడట. రజనీని నిన్నమొన్నటివరకూ మాఫియా డాన్ లేదా ఏరియా రౌడీ పాత్రల్లో చూసి చూసి బోర్ కొట్టేసిన ఆయన అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. 

Advertisement
CJ Advs

కాకపోతే.. మురుగదాస్ ట్రాక్ రికార్డ్ చూసే వాళ్ళు కాస్త భయపడుతున్నారు. తెలుగులో మహేష్ బాబుకి స్పైడర్ తో డిజాస్టర్ ఇచ్చిన మురుగదాస్.. సర్కార్ తో విజయ్ కి కూడా పెద్ద హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో రజనీని ఏం చేస్తాడా అని ఆయన అభిమానులు భయపడుతున్నారు. ప్రస్తుతం పెట్ట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ కొన్నాళ్ళ పాటు షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడట. ఈలోపు మురుగదాస్ స్క్రిప్ట్ ని ఇంకాస్త పకడ్బంధీగా ప్రిపేర్ చేస్తున్నాడు. 

ఇదే రజనీ ఆఖరి చిత్రమనే టాక్ కూడా నడుస్తుండడంతో.. తమిళనాట ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నమోదయ్యాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2020లో విడుదలకానుంది. మరి ఇది నిజంగానే రజనీ ఆఖరి చిత్రమవుతుందా లేదా అనేది తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

Rajini to play police after 30 years:

Rajinikanth to be seen as a police officer in murugadoss film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs