Advertisement
Google Ads BL

మహేష్ బాబు లెక్క సరిచేస్తున్నాడుగా..!


మహేష్ బాబు తో సినిమాలు నిర్మించేందుకు బోలెడుమంది నిర్మాతలు లైన్ లో ఉంటున్నారు. సూపర్ స్టార్ తో సినిమాలు చేసి క్యాష్ చేసుకుని క్రేజ్ కొట్టెయ్యాలనే నిర్మాతలు టాలీవుడ్ లో కోకొల్లలు. అందుకే దిల్ రాజు నిర్మాతగా మొదలైన వంశి పైడిపల్లి సినిమాలో ముందుగా సినిమాని సమర్పిస్తున్నానని చేరిన అశ్వినిదత్ తర్వాత నిర్మాతగా మారాడు. దిల్ రాజు, అశ్వినీదత్ లు మహర్షి సినిమాని నిర్మిస్తుంటే... బ్రహ్మోత్సవం తర్వాత తనతో సినిమా చెయ్యలేదని మహేష్ మీద పీవీపీ చిందులు తొక్కి మరి... మహర్షిలో మరో నిర్మాత అయ్యాడు పీవీపీ. మరి ఒకే ఒక్క సినిమాతో మహేష్ ముగ్గురు నిర్మాతలను లైన్ లోకి తెచ్చాడు.

Advertisement
CJ Advs

ఎప్పుడో మాటిచ్చిన నిర్మాతలు... మహేష్ తో సినిమాలు  ఇప్పుడే చేసేందుకు రెడీ అంటున్నారు. అందుకే మహేష్ కూడా తెలివిగా నిర్మాతలను తన సినిమాల్లో ఇరికించేస్తున్నాడు. తాజాగా సందీప్ వంగతో మహేష్ చెయ్యబోయే చిత్రానికి కూడా మహేష్ ఇద్దరు నిర్మాతలతోనే చేయబోతున్నాడట. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగకి కమిట్ అయినా సినిమాని మహేష్ తన బిజినెస్ పార్టనర్ ఏషియన్ సునీల్ నారంగ్ ని అలాగే ఎప్పుడో కమిట్ అయిన మైత్రి మూవీస్ వారిని కలిపాడట. ఇక సునీల్, మైత్రి వారు మాత్రమే కాకుండా.. ఈసారి తాను కూడా భాగస్వామి కాబోతున్నాడట. మహేష్ సొంత నిర్మాణ సంస్థ ఎంబి ఎంటర్టైన్మెంట్స్ ని కూడా మైత్రి,  ఏషియన్ సునీల్ తో కలిపి సందీప్ వంగా సినిమాని నిర్మించబోతున్నాడట మహేష్.

మరి మైత్రి వారి కమిట్మెంట్, బిజినెస్ పార్టనర్ ఏషియన్ సునీల్ కి చెయ్యాల్సిన సినిమా కమిట్మెంట్ కూడా ఒకే సినిమాతో మహేష్ తీర్చేస్తున్నాడు. మరి సుకుమార్ తో మైత్రిలో చేస్తున్న మహేష్ ఇపుడు.. సందీప్ వంగా సినిమాని మైత్రి వారికీ,  ఏషియన్ సునీల్ తోనూ.. అలాగే మహేష్ ఎంబి ఎంటర్టైన్మెంట్స్ లోను కలిపి చేస్తున్నాడు. ఏదైనా మహేష్ తెలివైనవాడు. 

Mahesh Babu Next Films Producers:

Sukumar and Sundeep Vanga are the Mahesh Babu next directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs