Advertisement
Google Ads BL

మళ్లీ మళ్లీ చూసేలా ఉందీ టీజర్


అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర  టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మళ్లీ మళ్లీ చూశా’ టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చేరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ .. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా ‘మళ్ళీ మళ్ళీ చూశా’ సినిమా అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. ‘‘మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చెసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియోని రిలీజ్  చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.’’ అన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ‌ ‘‘కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ’’ ఇదన్నారు. 

ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని, ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన

ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల,

మాటలు : హేమంత్ కార్తీక్,

ఎడిటర్ : సత్య గిడుతూరి,

పాటలు : తిరుపతి జావాన,

కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు కొణిదెన

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.

Click Here for Teaser

Malli Malli Choosa movie Teaser Released:

Suresh Babu Launches Malli Malli Choosa Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs