తన వల్ల నష్టపోయిన నిర్మాతకు మరో సినిమా చేస్తూ హీరోలు ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తుంటారు. అదే పని శర్వానంద్ చేయబోతున్నాడు. ఇటీవల శర్వానంద్ నటించిన చిత్రం `పడి పడి లేచే మనసు`. హను రాఘవపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమా నిర్మాణం, పబ్లిసిటీ మొత్తం కలిపి ఈ చిత్రానికి దర్శకుడు ఖర్చు పెట్టించింది 33 కోట్ల. వచ్చింది మాత్రం ప13 కోట్లే. దీంత ఈ సినిమా తీసుకున్న బయ్యర్స్ 20 కోట్లు నష్టపోయారు.
శర్వానంద్ మార్కెట్‌ని మించి ఖర్చు చేసిన ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అవసరమా? అని పలువురు ఇండస్ట్రీ వర్గాలు చెప్పిన పెడచెవిన పెట్టిన హను రాఘవపూడి ఈ సినిమా రూపంలో బయ్యర్లకు భారీ స్థాయిలోనే శఠగోపం పెట్టేశాడు. ఆ నష్టాల్ని భర్తీ చేయడం కోసం సుధాకర్ చెరుకూరికి శర్వానంద్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే శర్వాకు కథ వినిపించాడని, కొత్త తరహా ప్రేమకథ కావడంతో శర్వా, సుధాకర్ చెరుకూరి ఓకే చేశారని తెలిసింది. అయితే ఇక్కడో చిక్కుంది.
`ప్రేమమ్` రీమేక్‌తో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్న చందూ మొండేటిని నాగచైతన్యతో చేసిన `సవ్యసాచి` ఫలితం చాచి కొట్టింది. దీని నుంచి బయటపడాలని చూస్తున్న చందూ మొండేటి శర్వాకు హిట్టిస్తాడా అన్నది కొంత ఆలోచించాల్సిన విషయమే. అయినా తప్పదు కాబట్టి అతను చెప్పిన కథ నచ్చి శర్వానంద్ మరో ఆలోచన లేకుండా కమిట్ అయినట్టు చెబుతున్నారు. మరి ఈ సినిమాతో అయినా సుధాకర్ చెరుకూరి హిట్టిస్తాడా?. `పడి పడి..`తో నష్టాలు చవిచూసిన బయ్యర్స్ బయటపడతార అన్నది చందూ మొండేటి చేతుల్లోనే వుంది.