Advertisement
Google Ads BL

నలుగురు హీరోయిన్లు హాట్‌హాట్‌గా..


న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

Advertisement
CJ Advs

బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.  హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ - ‘‘మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు.  కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి’’ అన్నారు. 

నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ - ‘‘హైద‌రాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘుకుంచె, సినిమాటోగ్ర‌ఫీ:  శేఖ‌ర్ గంగ‌మోని, పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల‌, ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిటింగ్‌:  నాగేశ్వ‌ర్ రెడ్డి, పి.ఆర్‌.ఒ: ఫ‌ణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విక్కీ రొల‌ర్ కొస్ట‌ర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సాయికుమార్ పాల‌కూరి, స‌హ నిర్మాత‌లు:  రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత‌:  హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బాలు.

Romantic Comedy Entertainer film with Four Heroines:

Black And White Pictures Movie Details 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs