Advertisement
Google Ads BL

సీనియర్‌ స్టార్ల దూకుడు మొదలైంది..!


యంగ్‌స్టార్స్‌ ఎందరో వస్తున్నా.. సీనియర్‌ స్టార్స్‌ హవా మాత్రం తగ్గడం లేదు. దాదాపు దశాబ్దంపైగా సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలకు దాదాపు బై బై చెప్పేసి తన 150వ చిత్రంగా ‘ఖైదీనెంబర్‌ 150’తో ముందుకు వచ్చాడు. రాజకీయాల వల్ల కొందరిగా మారిన చిరు సినిమాలలో మాత్రం తాను మరలా అందరివాడినే అని నిరూపించి నాన్‌-బాహుబలి రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘బాహుబలి’ని టార్గెట్‌ చేస్తూ ఏకంగా 250 కోట్ల బడ్జెట్‌తో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా...నరసింహారెడ్డి’లో నటిస్తున్నాడు. దీని తర్వాత కొరటాల, బోయపాటి, త్రివిక్రమ్‌ వంటి వారిని కూడా లైన్‌లో పెట్టాడు. 

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలకే ఓకే చెబుతున్నాడు. ఎంతో వేగంగా చిత్రాలు చేస్తూ ఒకటి షూటింగ్‌లో ఉండగానే మరో రెండు మూడు లైన్‌లో పెడుతున్నాడు. ఇలా సెంచరీ దాటినా తన వేగం ఇంకా పెంచుతున్నాడు. బోయపాటి శ్రీను, వినాయక్‌, అనిల్‌ రావిపూడి వంటి దర్శకులతో చిత్రాలు చేయడానికి రెడీ అవుతూ ప్రస్తుతం తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండోపార్ట్‌ ‘మహానాయకుడు’తో బిజీగా ఉన్నాడు. నాగార్జున విషయానికి వస్తే ఈయన కూడా సోలో హీరోగా, మల్టీస్టారర్స్‌ కూడా చేస్తున్నాడు. ‘దేవదాస్‌’ తర్వాత బాలీవుడ్‌లో నటిస్తూ, తనకి అద్భుతమైన హిట్‌ ఇచ్చిన రెండు చిత్రాల సీక్వెల్స్‌కి రెడీ అవుతున్నాడు. 

నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’తో భారీ హిట్‌ కొట్టిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆ చిత్రంలో బంగార్రాజుగా మెప్పించిన పాత్రనే టైటిల్‌గా ఎంచుకున్నాడు. ఇందులో ఆయన తనయుడు నాగచైతన్య తన తండ్రి పోషించే బంగార్రాజుకి మనవడిగా నటించనుండటం విశేషం. 

సంక్రాంతికి భారీ పోటీలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ కొట్టిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సెంటిమెంట్‌ని పాటిస్తూ వచ్చే సంక్రాంతికి ‘బంగార్రాజు’ని బరిలో దింపనున్నారు. ఇక తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమైన ‘మన్మథుడు’కి సీక్వెల్‌ చేయడానికి ఓకే చెప్పాడు. త్రివిక్రమ్‌తో కాకుండా ‘చి.ల.సౌ’తో దర్శకునిగా డీసెంట్‌ హిట్‌ని అందుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జుననే ఈ మూవీని నిర్మించనుండటం విశేషం. 

ఇక మరో సీనియర్‌ స్టార్‌ వెంకటేష్‌ విషయానికి వస్తే ఎంతో కాలం తర్వాత తనదైన కామెడీ టచ్‌తో ‘ఎఫ్‌ 2’తో ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచాడు. తన కమ్‌ బ్యాక్‌ని అద్భుతంగా ప్రారంభించనున్న ఆయన బాబి దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’గా రానున్నాడు. మొదట్లో ఇందులో వెంకీ కంటే చైతుకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నా. ఇప్పుడు ‘ఎఫ్‌ 2’ విజయం చూసి వెంకీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ, మరింతగా వెంకీకి కామెడీ ఉండేలా ఈ స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారు ఇక త్రినాథరావు నక్కిన, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పాటు మరోసారి అనిల్‌రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఇలా సీనియర్‌ స్టార్స్‌ తమ వారుసులని మించిన జోరు చూపిస్తూ ఉండటం ఆయా హీరోల అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాదు.. సినిమా పరిశ్రమ కళకళలాడటానికి కారణంగా నిలుస్తోంది. 

Senior Stars Busy with Big Projects:

Chiru, Balayya, Nag and Venky busy with Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs