Advertisement
Google Ads BL

సుక్కూ.. ఈ టైటిల్ ఎవరికోసం..?


స్టార్‌ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తీసే చిత్రాల తాలూకు సినిమాల విషయంలోని వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచాలంటే అది జరిగే పనికాదు. యూనిట్‌లోని ఎవరో ఒకరు లీక్‌చేయడమో, షూటింగ్‌ సందర్బంగా వేలాది మందితో కలిసి పనిచేసే సమయంలో ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తూ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు, టెక్నాలజీ పెరిగిన నేపధ్యంలో షూటింగ్‌ స్పాట్‌లోని స్టిల్స్‌, ఇతర విషయాలు కూడా బయటకు పొక్కుతుంటాయి. ఇక టైటిల్స్‌ విషయంలో మన మీడియా అందరికంటే ఫాస్ట్‌గా ఉంటుంది. ఫిల్మ్‌ఛాంబర్‌లో కొత్తగా రిజిష్టర్‌ అయ్యే టైటిల్‌ ఏమిటి? ఏ బేనర్‌లో అవి రిజిష్టర్‌ అయ్యాయి? వంటివి బయటకు వస్తూ ఉంటాయి. 

Advertisement
CJ Advs

ఇక రెండు మూడు టైటిల్స్‌లో ఏది పెట్టాలా? అనే అనుమానం యూనిట్‌ కి వచ్చినప్పుడు ఫలానా టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయని  ముందుగా యూనిట్‌ వారే మీడియాకి లీక్‌ చేసి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అనే అంచనాకు వస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ పెద్ద పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్‌ చేయడమే కాదు... నిర్మాతగా కూడా తన శిష్యులకు అవకాశం ఇస్తూ ‘కుమారి 21ఎఫ్‌’ వంటి చిత్రాలు తీశాడు. ఇక మైత్రిమూవీమేకర్స్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఒకే సమయంలో పలు చిత్రాలు చేసే వారు ఫిల్మ్‌చాంబర్‌లో టైటిల్‌ రిజిష్టర్‌ చేస్తే వాటిలో ఏ టైటిల్‌, ఏ చిత్రానికి అనేది కనిపెట్టడం కష్టమే. 

ఇక ప్రస్తుతం మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ని హీరోగా తెరంగేట్రం చేస్తూ సుకుమార్‌, మైత్రిమూవీమేకర్స్‌లు ఓ చిత్రం తీస్తున్నారు. దీనికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్‌. మరోవైపు సుకుమార్‌, మైత్రిమూవీ మేకర్స్‌ కాంబినేషన్‌లో మహేష్‌ 26వ చిత్రం రూపొందనుంది. దీని టైటిల్‌పై ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇదే సమయంలో సుకుమార్‌ కోడైరెక్టర్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘హర హర శంభో శంకర’ అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాడు. 

మైత్రి మూవీ మేకర్స్‌ ఈ టైటిల్‌ని రిజిష్టర్‌ చేస్తే మహేష్‌ టైటిల్‌ ఇదే అని అందరికీ తెలుస్తుందని, అందుకే సుక్కు కోడైరెక్టర్‌ చేత ఈ టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాడనే వార్తలు వస్తున్నాయి. కానీ సుకుమార్‌, మైత్రి సంస్థలు పలువురితో చిత్రాలు చేస్తోన్న సమయంలో ఇది మహేష్‌ చిత్రం టైటిలే అని ఖచ్చితంగా చెప్పలేం...! 

Sukumar Registers a Powerful Title:

Sukumar Registers This Title for Whom?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs