Advertisement
Google Ads BL

ఎఫ్ 2 అంతేగా..? ఎఫ్ 3 స్టోరీ అదిరింది


ఎఫ్ 2 భారీ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే ఎఫ్ 3 ని కూడా స్టార్ట్ చేస్తాం అని మేకర్స్ స్టేజ్ మీద ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 మాదిరే హిలేరియస్ గా ఉంటుందని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా కథ ఏమై ఉంటుందని చర్చ స్టార్ట్ అయింది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ మీడియా పర్సన్ తన అకౌంట్ లో పోస్ట్ చేసిన స్టోరీ ప్రస్తుతం అన్ని చోట్ల హల్ చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

హైదరాబాద్ లో ఉంటున్న వెంకీ అండ్ వరుణ్ జంటలు హాయిగా కాలాన్ని గడుపుతున్న టైములో వెంకీ - తమన్నా జంటకి కవల పిల్లలు పుడతారు. వరుణ్ - హనీ కూడా అదే ఇంట్లో ఉంటారు. వారి పిల్లలు వల్ల వరుణ్ - హనీలకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఐదేళ్లు వరకు పిల్లలు వద్దు అనుకున్న వీరికి వెంకీ పిల్లలు నరకం చూపిస్తుంటారు. ఈ గోల భరించలేక వరుణ్ అండ్ హనీ దుబాయ్ లో రెస్టారెంట్ ఓపెనింగ్ అనే సాకుతో అక్కడికి వెళ్ళిపోతారు.

వీళ్లు దుబ్బాయి వెళ్లిన తరువాత ఇక్కడ అన్నపూర్ణమ్మ బకెట్ తన్నేస్తది. చనిపోయే ముందు వీలునామాలో డెబ్భై కోట్లు విలువ చేసే తన యాభై ఎకరాల పొలాన్ని హారిక, హనీల పిల్లలకు సమానంగా రాసి పోతుంది. అది కూడా ఒక కండిషన్ తో. ఇద్దరిలో ఎవరికి పిల్లలు లేకపోయినా మొత్తం ఆస్తి పిల్లలు ఉన్నవాళ్లకే వెళ్తుందని మెలిక పెడుతుంది. దీనితో వరుణ్ పిల్లలు కోసం ట్రై చేద్దాం అంటే అందుకు హనీ  ఒప్పుకోదు. చేసేది ఏమి లేక దుబాయ్ నుండి వస్తూ వస్తూ అక్కడ వరుణ్ ఫ్రెండ్ వాళ్ల అబ్బాయిని తీసికొచ్చి మా అబ్బాయే అని చెప్పుకుంటున్నారు.

మా పిల్లలు గొప్పంటే మా పిల్లలు గొప్పంటూ  పోటాపోటీగా హెచ్చులకు పోవడం మొదలుపెడతారు. ఈ లోపు వరుణ్ ఫ్రెండ్ దుబాయ్ ఫ్రెండ్ ఇండియాకు వచ్చి డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంట్లోనే తిష్ట వేస్తాడు. సరిగా వీలునామా చెల్లుబాటు అయ్యే రోజున వెంకీ కవల పిల్లలకు సంబంధించి ఒక ట్విస్ట్ బయట పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలో చూడాలని అతను చెప్పాడు. వినటానికి చూడటానికి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

F3 Story Sensation in social Media:

F3 Story Ready
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs