Advertisement
Google Ads BL

ఇగో వల్లే రామ్ నుంచి శ్రీనివాస్‌కు..!


ఆర్‌.ఎక్స్‌100 లాంటి బోల్డ్ కంటెంట్ తో సక్సెస్ అందుకున్న కొత్త డైరెక్టర్ అజ‌య్ భూప‌తి తన నెక్స్ట్ మూవీ హీరో రామ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆర్‌.ఎక్స్‌100 విడుద‌ల కాగానే అజయ్ వెంటనే రామ్ కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. కానీ మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Advertisement
CJ Advs

రామ్ ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే అజయ్ - రామ్ సినిమా ఆగడానికి కారణం ఏమై ఉంటుందని టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు వచ్చిన విషయం ఏంటంటే...అజ‌య్ భూప‌తి చెప్పిన క‌థ‌ని ఓకే చేసిన రామ్‌, స్క్రిప్టు ద‌శ‌లో కొన్ని మార్పులూ చేర్పులూ సూచించాడ‌ట‌. ఎన్ని మార్పులు చేసినా రామ్ కి అవి సరిగా నచ్చకపోవడంతో ఇద్దరూ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డార‌ని దాంతో వారి మధ్య ఈగో క్లాషెష్‌ మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. అందుకే రామ్ తన నెక్స్ట్ మూవీ పూరితో చేస్తున్నాడని టాక్.

అజయ్ కూడా ఏమి ఆలోచించకుండా రామ్ కు చెప్పిన కథే బెల్లంకొండ శ్రీనివాస్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడని సమాచారం. శ్రీనివాస్ స్క్రిప్ట్ విషయంలో ఒక్క మార్పు కూడా చెప్పకుండా ఓకే చేశాడని చెబుతున్నారు. హీరో అన్నాక మార్పులు చెప్ప‌డం స‌హ‌జ‌మే. కానీ అజయ్ కు అలా మార్పులు చెప్పడం ఇష్టం లేదు అనుకుంట. ఒక్క హిట్ తో అజయ్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇటువంటి విషయాల్లో అజయ్ కొంచెం చూసుకుని వెళ్లడం మంచిది. ఆ మార్పులు యేవో చేసి ఉంటే ఫామ్ లో ఉన్న హీరోనే దొరికేవాడు. ప్రస్తుతం బెల్లంకొండ ఫామ్ లో లేడు. ఈ ప్రాజెక్ట్ అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Reason Behind Ajay Bhupathi and Bellamkonda Movie Chance:

Ram Dropped RX 100 Director Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs