సుకుమార్ సినిమాల్లో హీరోలకు ఒక స్పెషల్ లుక్ ని ఇస్తాడు సుకుమార్. రొటీన్ లుక్ కి భిన్నంగా హీరోలను చూపిస్తాడు. ఆయన మొదటి సినిమా నుండి అదే జరుగుతుంది. కానీ వన్ నేనొక్కడినే సినిమాలో మాత్రం మహేష్ ని మహేష్ లానే చూపెట్టాడు. అంటే కాస్త సిక్స్ ప్యాక్ ని ట్రై చేయించాడు కానీ.. అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక సుకుమార్ సినిమాల్లో హీరోల లుక్స్ అంటే... ఆర్యలో అల్లు అర్జున్ స్పెట్స్, హెయిర్ పెంచి డిఫరెంట్ గా చూపెడితే ... నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్ కి గెడ్డం పెంచి న్యూ హెయిర్ స్టయిల్లో చూపెట్టాడు.
ఇక రంగస్థలంలో రామ్ చరణ్ ని చాలా రఫ్ అండ్ టఫ్ గా గెడ్డం లుక్ లో ప్రెజెంట్ చేశాడు. గత రెండు మూడు సినిమాల నుండి సుకుమార్ తన సినిమాల్లోని హీరోలను గెడ్డం లుక్ లోనే చూపిస్తున్నాడు. తాజాగా తన తదుపరి చిత్రంలో మహేష్ కి కూడా గెడ్డం పెంచి గెడ్డం లుక్ లోకి మార్చే యోచనలో సుకుమార్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. సుకుమార్ రంగస్థలం తర్వాత మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ ని కాస్త డిఫరెంట్ గా ఎప్పుడూ చూడని లుక్ లో అలాగే గెడ్డం లుక్ లో మార్చాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడట.
1 నేనొక్కడినే సినిమాలో మహేష్ కి సిక్స్ ప్యాక్ బాడీ లుక్ లోకి మారుద్దామని చూసి సుకుమార్ భంగపడ్డాడు. అయితే ఈసారి మాత్రం ఈ సినిమాలో మహేష్ ని ఖచ్చితంగా డిఫ్రెంట్ లుక్ లోకి మార్చాలని చూస్తున్నాడట. రంగస్థలంలో రామ్ చరణ్ కి, నాన్నను ప్రేమతో లో ఎన్టీఆర్ కి గెడ్డం పెంచినట్లుగా మహేష్ కు కూడా గెడ్డం పెంచి.. కొత్త లుక్ లోకి తేవడానికి చూస్తున్నాడట. అయితే ఎప్పుడూ నూనూగు మీసాలతో లేత కుర్రాడిలా కనబడే మహేష్ గెడ్డం లుక్ లో ఎలా సెట్ అవుతాడో అనే దానికోసం మహేష్, మహర్షి షూటింగ్ పూర్తికాగానే... మహేష్ తో గెడ్డం పెంచించి మంచి షేప్ తో ట్రైల్ షూట్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి సుకుమార్ చిత్రంలో మహేష్ గెడ్డంతో కనిపిస్తాడా లేదంటే... మళ్ళీ నార్మల్ లుక్ మహేష్ నే చూస్తామో అనేది కాస్త సస్పెన్స్.