Advertisement
Google Ads BL

అన్నపూర్ణమ్మ గారి మనవడంట..!!


ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. నర్రా శివనాగేశ్వర్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న అందమైన ఓ గ్రామంలో షూటింగ్ ను జరుపుకోనున్నారు.  

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా నిర్మాత చిత్ర విశేషాలను పంచుకుంటూ..  ‘‘ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏం జరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్ లో పెద్ద దిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ అనే వినూత్న పవర్ ఫుల్ పాత్రలో నటీమణి అన్నపూర్ణ  కనిపిస్తున్నారు.  ఆ పల్లెటూరిలోనే ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు.  ఇక షూటింగ్ సెట్ విషయానికి వస్తే.. ఆ ఊరిలోనే పంచాయతీ దర్బార్ సెట్ అందరినీ ఆకర్షింప చేస్తుంది.  అంతేకాకుండా పంచాయతీ సన్నివేశాలకు గానూ  రెండు వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో  అర్చన హీరోయిన్ గా నటిస్తుంది. జీవ, రఘుబాబు, కాటమంచి రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, శ్రీ హర్ష, అదుర్స్ సాయి, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రభ, జయ వాణి తదితరులు నటిస్తున్నారు..’’ అని తెలిపారు. 

Annapurna Powerful role in Annapurnamma Gari Manavadu:

Annapurnamma Gari Manavadu movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs