Advertisement
Google Ads BL

వరుణ్‌ తేజ్‌ని విలన్ అవ్వనీయడం లేదా?


గత ఏడాది వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలిప్రేమ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. తొలిప్రేమ లాంటి ప్రేమకథ చిత్రం చేసిన వరుణ్ తేజ్ మళ్ళీ అలాంటి సినిమానే చేస్తాడట అనుకుంటే... డిఫరెంట్ గా అంతరిక్షం సినిమా చేశాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన స్పేస్ మూవీ అంతరిక్షం అంచనాలు అందుకోలేకపోయింది. ఇక అంతరిక్షం విడుదలైన నెలకే ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వెంకటేష్ తో కలిసి కామెడీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కన్నా ఎక్కువగా వెంకటేష్ నటనకు మంచి మార్కులు పడినా.. వరుణ్ ఖాతాలో మంచి హిట్ చేరింది.

Advertisement
CJ Advs

అయితే ఎఫ్ 2 తర్వాత వరుణ్ తేజ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తమిళ్ రీమేక్ జిగ‌డ్తాండ‌లో విల‌న్‌గా నటించేందుకు ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే. తమిళ్ రీమేక్ జిగ‌డ్తాండ‌లో చేసిన బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తాడని.. అన్నారు. అనడం కాదు వరుణ్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, విలన్ లుక్స్ అన్నీ ఉండడం.. అలాగే ఇప్పటివరకు వరుణ్ సాలిడ్ క్యారెక్టర్స్ అంటే లవర్ బాయ్ లాంటి పాత్రలు చెయ్యడం మాత్రమే చేశాడు. అందుకే కాస్త డిఫరెంట్ గా ఉండాలని తమిళ రీమేక్ జిగ‌డ్తాండ‌లో విలన్ గా చెయ్యడానికి వరుణ్ ఒప్పుకున్నాడు.

అయితే తాజాగా ఎఫ్ 2 హిట్ తర్వాత వరుణ్ తేజ్ తమిళ్ రీమేక్ లో విలన్ గా నటించే విషయంలో కాస్త ఆలోచనలో పడినట్లుగా వార్తలొస్తున్నాయి. కాస్త ఫామ్ లో కొచ్చిన తర్వాత విలన్ పాత్రలు చెయ్యడం సరైనది కాదని వరుణ్ తండ్రి నాగబాబు, వరుణ్ కి సలహా ఇచ్చాడని అంటున్నారు. ఎఫ్ 2 విజయాన్ని జిగ‌డ్తాండ‌ లో విలన్ గా చేసి పోగొట్టుకోవద్దని.. కాస్త ఆలోచించమని నాగబాబు కొడుక్కి హితోపదేశం చేసినట్లుగా తెలుస్తుంది. మరి తండ్రి మాట విని వరుణ్ తేజ్ జిగ‌డ్తాండ‌ రీమేక్ నుండి తప్పుకుంటాడో.. లేదో.. అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.  

Nagababu Suggestion to Varun Teja:

No Varun Tej in jigarthanda Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs