Advertisement
Google Ads BL

‘మహర్షి’కి ఇదే హైలెట్ సీన్ అంట!


మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ టు తో హిట్ బోణి చేశాడు. ఇప్పుడు మహర్షి సినిమాతోను భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజు తో పాటుగా పివిపి, అశ్వినీదత్ లు కూడా మహర్షి మూవీ నిర్మాతలే. ముగ్గురు బడా నిర్మాతలు మహర్షి సినిమాకి భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ కి ఫ్రెండ్ గా కీ రోల్ లో నటిస్తున్నాడని.... ఈ సినిమా మొత్తం రైతు సమస్యల చుట్టూనే తిరుగుతుందని తెలిసిందే.

Advertisement
CJ Advs

తాజాగా మహర్షి ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అదుర్స్ అని చెబుతున్నారు. బాగా ధనిక కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి... ప్రేమాభిమానాలు, స్నేహపూర్వక మహర్షిగా ఎలా మారాడో అనేది సినిమా కథ అని.. మహర్షి సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని... సెకండ్ హాఫ్ మొత్తం కాస్త సీరియ‌స్ ఎమోష‌న్స్‌తో న‌డ‌వ‌బోతోందని... అయితే ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఈ సినిమాకి అత్యంత కీల‌కం అంటున్నారు. ఇక అక్క‌డే మహేష్ (రిషి)లో మార్పు వ‌స్తుంద‌ట‌. అప్పటినుండి రిషి తన బాధ్య‌తేంటో తెలుసుకుని రైతులకి ఉపయోగపడుతూ.. క‌థ మ‌రో మ‌లుపు తిప్పుతాడని చెబుతున్నారు.

అలాగే తన ఎదుగుదలకు కారణమైన ఫ్రెండ్ కష్టాల కడలిలో ఉన్నాడని తెలుసుకుని... ఆ ఫ్రెండ్ ని ఆదుకోవడానికి మహేష్ అమెరికా నుండి పల్లెటూరికి వస్తాడని.. అక్కడే మహేష్ మారడానికి ఒక బలమైన సంఘటన కారణమవుతుందని..  ఆ సంఘటనే ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అట. ఇక మహేష్ ఫ్రెండ్ అల్లరి నరేష్ (రవి) పాత్ర సెకండ్ హాఫ్ లో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మహేష్ - అల్లరి నరేష్ మధ్యన వచ్చే ఫ్రెండ్ షిప్ సీన్స్ సినిమాకి హైలెట్ అంటున్నారు.

Highlight Scene in Maharshi movie:

Mahesh Maharshi Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs