Advertisement
Google Ads BL

నువ్ మామూలోడివి కాదయ్యా ఆర్జీవీ..!


ఆయన ప్రకటించిన సినిమాల్లో ఎన్ని సెట్స్ వరకూ వెళ్తాయి, సెట్స్ కి వెళ్ళిన సినిమాల్లో ఎన్ని సినిమాల టీజర్స్ విడుదలవుతాయి, అలా విడుదలైన టీజర్స్ ఎన్ని సినిమాలుగా రూపాంతరం చెంది థియేటర్లలోకి వస్తాయి వంటి విషయాలను కాసేపు పక్కన పెడితే.. తాను ప్రకటించిన లేదా టీజర్ రిలీజ్ చేసిన ప్రతి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయగల మగాడు రాంగోపాల్ వర్మ మాత్రమే. నిన్న విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజరే అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పట్నుంచి ఏదో ఒక విధంగా రచ్చ చేస్తూనే ఉన్నాడు ఆర్జీవి. ముఖ్యంగా వెన్నుపోటు అంటూ వర్మ విడుదల చేసిన పాట చిన్నసైజు దుమారాన్ని రేపింది. 

Advertisement
CJ Advs

ఇదంతా పక్కన పెడితే.. నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ చూసినవాళ్ళందరూ ఆ టీజర్ లో కనిపించిన వ్యక్తి అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ లాగే ఉన్నాడంటూ కంపేరిజన్స్ చేయడం మొదలెట్టారు. అంతటితో ఆగలేదు ఎన్టీఆర్ కథానాయకుడులో చిత్రంలో బాలయ్య కంటే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో యాక్టరే సీనియర్ రామారావుగా పర్ఫెక్ట్ గా సరిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ ఆర్జీవీ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ చూసి కుళ్లుకుంటున్నారు. 

అయినా పాత్రకు తగ్గ పాత్రధారులను సెలక్ట్ చేయడంలో వర్మ ఎప్పుడూ దార్శనీకుడే. వీరప్పన్ టైమ్ లో కూడా సందీప్ భరద్వాజ్ ను చూసి నిజమైన వీరప్పన్ అనుకొనేలా ప్రొజెక్ట్ చేశాడు ఆర్జీవి. ఇప్పుడు ఎవరో సీనియర్ క్యారెక్టర్ ను తీసుకొచ్చి ఎన్టీఆర్ కు జిరాక్స్ కాపీలా ప్రొజెక్ట్ చేస్తున్న తీరుకు అందరూ షాక్ అవుతున్నారు. సినిమా ఆడుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే.. వర్మ ఆల్రెడీ తాను అనుకున్న సంచలనం అయితే సృష్టించేశాడు.

Rgv Version of NTR Biopic is astounding :

RGV Brought the Perfect Replica of NTR for Lakshmis NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs