Advertisement
Google Ads BL

తాతయ్య కాబోతున్న నాగార్జున


తాతయ్య కాబోతున్న నాగార్జున అనే హెడ్డింగ్ చదివి.. సమంత-చైతన్య తల్లిదండ్రులు కాబోతున్నారు అనే కంక్లూజన్స్ కి వచ్చేయకండి. ఇక్కడ నాగార్జున తాతయ్య కాబోతున్నాడన్న వార్త నిజమే కానీ.. అది నిజజీవితంలో కాదు వెండితెర కోసం. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా.. ఇక్కడ విశేషం ఏంటంటే.. నాగార్జున తాతయ్యగా కనిపించబోయేది నాగచైతన్యకే. ఇదివరకే మనం సినిమాలో నాగచైతన్యకు కొడుకుగా నటించిన నాగార్జున ఇప్పుడు చైతూ తాతగా కనిపించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఇదంతా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కనున్న బంగార్రాజు కోసం జరుగుతున్న హడావుడి. 

Advertisement
CJ Advs

నిజానికి నాగార్జున ముందుగా రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథతో మన్మధుడు 2 మొదలెడదామనుకున్నాడు. కానీ.. రాహుల్ ఇంకా ఫుల్ నేరేషన్ ఇవ్వడానికి టైమ్ అడగడం, అప్పటికే కళ్యాణ్ కృష్ణ కథతో రెడీగా ఉండడంతో ముందుగా కళ్యాణ్ ప్రొజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు నాగార్జున. నాగ్ కెరీర్ లోనే క్రేజీయస్ట్ ఫిలిమ్ గా రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవ్వనుంది. 

నాగార్జున ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ తో అనుకున్న సినిమా పట్టాలెక్కకపోవడంతో ఇప్పుడు తన కాన్సస్ ట్రేషన్ ను టాలీవుడ్ పై పెట్టాడు.

Nagarjuna turned Grandfather for Nagachaitanya:

Nagarjuna is all set to play the role of a grand father in Bangarraju for Naga Chaitanya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs