Advertisement
Google Ads BL

లక్ష్మీ పార్వతిగా ఆ బూతు నటి ఎందుకు బాబు..?


అప్పట్లో న్యూస్ చానల్స్, యూట్యూబ్ చానల్స్ అనే తేడా లేకుండా ఎవరు పిలిచినా సరే ఊపుకుంటూ వెళ్ళిపోయి తనకు తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని కలిపి ఇండస్ట్రీ గురించి, తనకు జరిగిన అన్యాయం (ఆమె అనుకొంటోంది) గురించి కథలు కథలుగా చెప్పి చిత్ర పరిశ్రమ పరువును బజారుకీడ్చిన శ్రీరెడ్డి మీద జాలిపడి తేజ పిలిచి మరీ.. అప్పటికి తాను దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి తేజ తప్పుకోవడంతో శ్రీరెడ్డిని పట్టించుకున్నవాళ్లు లేరు. ఆ ఎన్టీఆర్ బయోపిక్ మిస్సైన శ్రీరెడ్డికి మరో ఎన్టీఆర్ బయోపిక్ లో అవకాశం వచ్చిందని వినికిడి. 

Advertisement
CJ Advs

అయితే.. మీరు అనుకుంటున్నట్లు అది ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదండోయ్.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ వీరగ్రంధం అనే సినిమాలో. నిన్న విడుదలైన ఈ చిత్రం టీజర్ లో లక్ష్మీ పార్వతి పాత్రధారిణి చూపించినట్లే చూపించి మాయమైంది అనిపించారు. ఆ నటి మరెవరో కాదని శ్రీరెడ్డేననీ విశ్వసనీయ వర్గాల సమాచారం. తేజ రిక్వెస్ట్ మేరకు ఆమెను జగదీశ్వర్ రెడ్డి క్యాస్ట్ చేసుకొన్నాడట. 

ఎప్పుడు విడుదలవుతుందో, అసలు విడుదలవుతుందో లేదో కూడా తెలియని ఈ చిత్రంలో శ్రీరెడ్డి నటించడం పెద్ద విశేషం కాదు కానీ.. సమాజంలో ఎన్టీఆర్ సతీమణి అనే పేరు ఉన్న లక్ష్మీ పార్వతి పాత్రను శ్రీరెడ్డి పోషించడమే చర్చనీయాంశం కానుంది. మరి శ్రీ శ్రీ శ్రీరెడ్డి లక్ష్మీ పార్వతి పాత్రను తన అభినయంతో పండిస్తుందో లేక ఎప్పట్లానే అనవసరమైన అందాల ప్రదర్శనతో బ్రష్టు పట్టిస్తుందో తెలియాలంటే కనీసం సినిమా టీజర్ రిలీజ్ అయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.

Sri Reddy as Lakshmi Parvatha in Veeragrandham:

Sri Reddy playing the role of Lakshmi Parvathi in Lakshmi Veeragrandham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs