Advertisement
Google Ads BL

‘మహర్షి’పై ఈ వార్త నిజమేనా..?


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో రైతు సమస్యలు తీర్చే నాయకుడిగా కనిపించనున్నాడు. మహేష్ కి జోడిగా పూజాహెగ్డే  నటిస్తున్న ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు నిర్మాతలు అయిన దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం. దానికి కారణం విడుదల తేదీని ఏప్రిల్ 26వ తేదీకి మార్చే ఆలోచన చేస్తుండటమే. గతంలో మహేష్ చూసుకుంటే ఏప్రిల్ చివరిలో విడుదల అయిన ‘పోకిరి, భరత్ అనే నేను’ సినిమాలు మంచి విజయం సాధించాయి.

అందుకే ఆ సెంటిమెంట్ కారణంగా ‘మహర్షి’ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మార్చనున్నట్టుగా చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

Rumours on Maharshi Movie Release date:

Maharshi Movie Release Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs