Advertisement
Google Ads BL

ప్రమోషన్ లేదు.. హిట్టు టాకే నిలబెట్టాలి


2017 సంక్రాంతిలో మెగాస్టార్ చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ - క్రిష్ ల గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటాపోటీగా విడుదలైనాయి. పెద్ద స్టార్స్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు భారీ అంచనాలతో ఉన్న సినిమాలు.. అయినప్పటికీ.. దిల్ రాజు కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కిన శతమానంభవతిని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు తెచ్చాడు. మరి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో సూపర్ హిట్ కొట్టగా... బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి కూడా హిట్ అయ్యింది. అంత పెద్ద సినిమాల్లో చిన్న సినిమాగా విడుదలైన శతమానంభవతి సూపర్ హిట్ అవడమే కాదు.. మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి దిల్ రాజుకి సెంటిమెంట్ నిచ్చింది.

Advertisement
CJ Advs

తాజాగా ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ చిత్రాల నడుమ తన చిత్రాన్ని విడుదల చెయ్యాలని దిల్ రాజు కంకణం కట్టుకుని కూర్చున్నాడు. గత ఏడాది డిసెంబర్ చివరి వరకు దిల్ రాజు సంక్రాంతి పోటీకి భయపడి తన చిత్రం ఎఫ్ టు వదలడేమోలే అనుకుంటే.. అనూహ్యంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకే తన ఎఫ్ టు సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేశాడు. మరి ఈ సంక్రాంతికి బాలకృష్ణతో మళ్ళీ పోటీపడ్డాడు దిల్ రాజు, 2017 లో తండ్రి చిరుతో పోటీపడిన దిల్ రాజు చిత్రం ఈ ఏడాది కొడుకు చరణ్ సినిమాతో పోటీ పడింది.

మరి ఈఏడాది కూడా దిల్ రాజు సంక్రాంతికి వచ్చి ఎప్పటిలాగే హిట్ కొట్టేశాడు. ఎఫ్ టు ఈ శనివారమే సంక్రాంతి కానుకగా చివరి చిత్రంగా విడుదలై, కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడం ప్రేక్షకులు మెచ్చడం జరిగింది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామలకు గట్టి పోటీ ఇచ్చింది ఎఫ్ టు చిత్రం. మరి దిల్ రాజు పెద్ద సినిమాల హడావిడిలో తమ సినిమా ప్రమోషన్స్ ఎందుకు అనుకున్నాడో.. లేదా ఎలాగూ హిట్ అవుతుంది ప్రమోషన్స్ అవసరం లేదనుకున్నాడో.. ఎఫ్ టు సినిమాకి చాలా తక్కువ ప్రమోషన్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రమోషన్స్ లేకపోయినా ఈ ఎఫ్ టు మౌత్ టాక్ తో లేచేలా కనబడుతుంది. ఎందుకంటే హిట్ టాక్ పడిందిగా.

No Promotions to F2 Movie:

F2 got Hit talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs