Advertisement
Google Ads BL

రకుల్ ని రచ్చకీడ్చిన సోషల్ మీడియా


ఈ ప్రపంచంలోనే మోస్ట్ అన్ ప్రెడిక్టబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియాలో మనం మంచిగా ఉంటే సరిపోదు, ఎదుటివారు కూడా మంచిగా ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. మన స్నేహితుల్లో మంచి, చెడు అనేది మనం ఎంచుకోగలం కానీ ఎవరో మనకు తెలియని వ్యక్తి నుంచి కూడా మంచి ఆశించడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఇక సోషల్ మీడియా ఎవరు, ఎందుకు ఎలా ట్రోల్ చేస్తారు అనేది ఎవరికీ అంతుబట్టని విషయం. ఈమధ్యకాలంలో ఈ ట్రోల్ పెజస్ ఎక్కువయ్యేసరికి ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే.. ఆ క్రియేటివిటీతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళకంటే.. నెగిటివ్ గా కామెంట్ చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువ. అందుకే చాలామంది స్టార్ హీరోహీరోయిన్లు ఈ నెగిటివ్ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోకపోవడమే కాదు కేర్ చేయరు కూడా. 

Advertisement
CJ Advs

అయితే.. నిన్న మాత్రం రకుల్ ఓ కుర్రాడు తన బట్టలపై చాలా అసభ్యంగా చేసిన కామెంట్ చూసి తన కోపాన్ని అణుచుకోలేకపోయింది. వెంటనే తిట్టిపడేసింది. ఆ తిట్టడమే ఆమె కొంప ముంచిందనుకోండి. రకుల్ ఆ కుర్రాడ్ని డైరెక్ట్ గా తిట్టకుండా అతడి తల్లిని కూడా ఈ రొచ్చులోకి లాగింది. దాంతో నిజానికి రకుల్ కి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళందరూ ఆమెకు యాంటీగా ట్వీట్స్ వేయడం మొదలెట్టారు. దాంతో ఒక్కసారిగా రకుల్ పై నెగిటివిటీ పెరిగిపోయింది. 

పాపం తర్వాత రకుల్ తాను ఆ కుర్రాడ్ని, అతడి తల్లి తిట్టడం గురించి ఎంత కన్విన్సింగ్ గా చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిన్న మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పుడు మరింత ఎక్కువైంది. అసలే తెలుగులో సరైన అవకాశాలు లేక, రాక ఇబ్బందిపడుతున్న తరుణంలో ఇలా సోషల్ మీడియాకి అనవసరంగా టార్గెట్ ఇవ్వడం ఇష్టం లేని రకుల్ డ్యామేజ్ కంట్రోలింగ్ మొదలెట్టినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 

Twitter Slams Rakul for No Reason:

Netizens fire on Rakul for the Twitter Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs