Advertisement
Google Ads BL

మెగా నిర్మాత కన్ను సీక్వెల్‌పై పడింది..!


స్ట్రెయిట్‌ చిత్రాల విషయంలోనే కాదు...పరభాషా రీమేక్‌లు, డబ్బింగ్‌ల విషయంలో కూడా ఆచితూచి ఎంపిక చేసుకునే జీనియస్‌ ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌. 2005లో మురుగదాస్‌ అజిత్‌కి చెప్పిన గజినిని తలా చేయలేకపోయాడు. దాంతో అదే సబ్జెక్ట్‌ని సూర్య హీరోగా తీసి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుని మురుగదాస్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇదే చిత్రంలోని సరికొత్త దనాన్ని కనిపెట్టిన అల్లుఅరవింద్‌ తెలుగులో దానిని రీమేక్‌ చేస్తే ఫీల్‌ మిస్‌ అవుతుందని గ్రహించి తెలుగులో డబ్‌ చేశాడు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో, మురుగదాస్‌కి, సూర్యకి తెలుగులో ఎంతటి స్టార్‌ ఫాలోయింగ్‌ని తీసుకుని వచ్చిందో తెలిసిందే.

Advertisement
CJ Advs

అదే సమయంలో అల్లుగారు దీని బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌ని తీసుకున్నాడు. తెలుగులో మాత్రం డబ్‌ చేసిన ఆయన హిందీలో మాత్రం మురుగదాస్‌ దర్శకత్వంలోనే అమీర్‌ఖాన్‌ హీరోగా రీమేక్‌ చేశాడు. ఈ మూవీ తొట్టతొలి 100కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా కాసుల వర్షం కురిపించింది. తాజాగా అల్లుఅరవింద్‌ తన గీతాఆర్ట్స్‌ బేనర్‌లో గజిని2 అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాడు. అల్లుఅరవింద్‌ టైటిల్‌ రిజిష్టర్‌ చేయించాడంటే దానిని ఈజీగా తీసి పారేయలేం. మరి ఇది సీక్వెలా? లేదా సరికొత్త కథతో రూపొందుతుందా? మురుగదాసే దర్శకత్వం వహిస్తాడా? అనేవి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ వస్తే గానీ తెలియదు. 

మరోవైపు మురుగదాస్‌ తన తదుపరి చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్‌తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయినా తమిళంలో రూపొందిన గజినిని మొదట తమిళంలో కాకుండా తెలుగులో తన సొంత బేనర్‌లో అల్లు రిజిస్టర్‌ చేయడంతో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మంచి చిత్రాలను నిర్మించడమే కాదు.. దానిపై టైటిల్‌ రిజిష్టర్‌ నుంచే చర్చ రేకెత్తించేలా చేయడంలో అల్లు సిద్దహస్తుడు. మరి అల్లు అశించిందే ప్రస్తుతం జరుగుతోంది. మరి ఈ చిత్రంపై పూర్తి వివరాలు అందే వరకు అంతా సస్పెన్సేనని చెప్పాలి...!

allu aravind eye on that movie sequeal:

gajini sequeal on cards 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs