స్టార్ హీరోయిన్ల వెంట పడకుండా తన చిత్రాలలో చాన్స్‌లిచ్చి వారిని స్టార్ హీరోయిన్లను చేసే స్టార్ నేచురల్‌స్టార్ నాని. ఆయన హనురాఘవపూడి దర్శకత్వంలో నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంలో హీరోయిన్ మహాలక్ష్మి పాత్రకు పంజాబీ భామ మెహ్రీన్‌పిర్జాని ఎంపిక చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓ బాలీవుడ్ చిత్రంతో పాటు కోలీవుడ్‌లో కూడా రెండు మూడు చిత్రాలు చేసింది. కానీ ఆమెకి తెలుగులో వచ్చిన గుర్తింపు ఇతర భాషల్లో రాలేదు.
మహానుభావుడు లో నటించి అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రవితేజ చిత్రం రాజా ది గ్రేట్ లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. సరైన పాత్రలు, హీరోలు ఉండే చిత్రాలలో నటిస్తే ఈమె స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని పలువురు భావించారు. కానీ కేరాఫ్‌సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం వంటి వరుస ఫ్లాప్‌లు ఈమెకి ఎదురయ్యాయి. దాంతో ఈమె దాదాపు అంతర్ధానం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో మరోసారి రాజా ది గ్రేట్ తర్వాత అనిల్‌రావిపూడి ఆమెపై నమ్మకం ఉంచాడు.
ఎఫ్2( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన హనీ పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా దిల్‌రాజు చిత్రం కాబట్టి ఆమెకి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈసారైనా ఆమె ఈ బ్రేక్ త్రూని సరిగా వాడుకుని, గోల్డెన్‌లెగ్‌గా కాకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా పాత్రలు, సినిమాలు, దర్శకహీరోల విషయంలో జాగ్రత్త వహిస్తే ఈమెకి తెలుగులో మరికొంత కాలం అనువైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విషయంలో ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది....!