Advertisement
Google Ads BL

ఉపాసన పొంగల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది....!


నేటి తరం హీరోలలో వారి కంటే వారి సతీమణులే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఉన్నారు. భర్తలకు చేదోడు వాదోడుగా ఉండటమే కాదు.. వారి భర్తల ఫొటోలను, వివరాలను పోస్ట్‌ చేస్తే వారి అభిమానులకు పండుగ వాతావరణం తీసుకుని వస్తున్నారు. వీరిలో మెగా కోడలు, రామ్‌చరణ్‌ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్‌ వ్యవహారాలను సైతం చూసుకుంటూ బిజీగా ఉండే ఉపాసన మెగా ఫ్యాన్స్‌కి వీలైనప్పుడలా చిరు, చరణ్‌ల విశేషాలను తెలుపుతూ ఉంటుంది. ఈసారి ఆమె కేవలం మెగాభిమానులనే కాదు..

Advertisement
CJ Advs

అక్కినేని అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగించి పొంగల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. తాజాగా రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందిన ఊరమాస్‌ చిత్రం వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. అందువల్లనో లేక బోయపాటి హూనం చేసి తనచేత వీరోచిత విన్యాసాలు చేయించిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని చరణ్‌ భావించాడేమో తెలియదు గానీ ఈ చిత్రం ప్రమోషన్స్‌ విషయం పక్కనపెట్టి అక్కినేని ఫ్యామిలీ చిన్నబుల్లోడు అఖిల్‌తో సహా వెకేషన్స్‌కి వెళ్లిపోయాడు.

అఖిల్‌ నటించిన మిస్టర్‌ మజ్ను చిత్రం ఈనెల 25వ తేదీన రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానుంది. ఇక రామ్‌చరణ్‌, అఖిల్‌లు కలిసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విదేశాలలో మంచు కొండల్లో స్కీయింగ్‌ చేయడానికి వెళ్లారు. స్కీయింగ్‌ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలను ఉపాసన సోషల్‌మీడియాలో పెట్టి... ట్విట్టర్‌ ఖాతా ద్వారా బాయ్స్‌ విల్‌ బి బాయిస్‌.. చరణ్‌ అండ్‌ అఖిల్‌.. యాక్షన్‌ సీన్స్‌ వంటివి ఏమీ ప్రాక్టీస్‌ చేయడం లేదని అనుకుంటున్నా అని క్యాప్షన్‌ జోడించింది.

మరో వైపు అఖిల్‌ నటించిన మొదటి రెండు చిత్రాలు అఖిల్‌, హలో చిత్రాలు సరైన విజయం సాధించలేదు. ఈ సమయంలో ఆయన తన మిస్టర్‌ మజ్ను చిత్రం ప్రమోషన్స్‌పై పూర్తి దృష్టి పెట్టకుండా ఈ సాహసాలు ఏమిటా? అనేఅనుమానం వస్తుందా? బహుశా ప్రమోషన్స్‌కి, రిలీజ్‌ డేట్‌కి ఇంకా కాస్త వ్యవధి ఉన్నందు వల్ల అఖిల్‌ ఈ ట్రిప్‌లో జాయిన్‌ అయ్యాడేమో? అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన చిత్రం ప్రమోషన్స్‌పై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. 

Upasana Pongal Gift:

Upasana Gift To Mega Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs