Advertisement
Google Ads BL

పాపం... ఈ స్టార్‌ కూడా బుక్కయ్యాడు


ఎంతైనా మన దేశం సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మనం నడుచుకోవాలి. స్వామి వివేకానందుకు అమెరికా వెళ్లినప్పుడు కూడా తన ప్రసంగంలో లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌ అని అనకుండా మై డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అని సంబోధించాడు. ఓ అందమైన డబ్బున్న, యవ్వనవతి అయిన ఓ అమ్మాయి మీలాంటి అబ్బాయి నాకు కావాలి... అని స్వామి వివేకానందుడిని అడిగితే.. నాలాంటి అబ్బాయి ఎందుకు.. నన్నే నీ అబ్బాయిగా (కొడుకుగా) భావించు... అని సమాధానం చెప్పి అబ్బురపడిచాడు. కానీ నేడు మాత్రం మన దేశంలో పాశ్చాత్య ధోరణి బాగా పెరిగిపోతోంది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, దేవతగా పూజించాల్సిన మహిళలను మనం ఏదేదో అనేస్తున్నాం. ఇలాంటి వాటికి దేశవ్యాప్తంగా పేరు గాంచిన కరణ్‌జోహార్‌ నిర్వహించే కాఫీ విత్‌ కరణ్‌ వేదికగా మారుతోంది.

Advertisement
CJ Advs

 

ఈ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్ధిక్‌పాండ్యా, లోకేష్‌రాహుల్‌ల కెరీరే ప్రమాదంలో పడింది. ఇదే సమయంలో పాత కాఫీ విత్‌ కరణ్‌ షోలో పలువురు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మన నెటిజన్లు వెతికి మరీ బయటకు తెస్తున్నారు. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట బాలీవుడ్‌ యంగ్‌స్టార్‌ రణవీర్‌సింగ్‌ ఈ షోలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాడు సోషల్‌మీడియా అంత విస్తారంగా లేని కారణంగా అవి జనాలకు చేరలేకపోయాయి. కానీ అవే ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. రణవీర్‌సింగ్‌ కాఫీ విత్‌ కరణ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, కరీనాకపూర్‌, అనుష్కశర్మల గురించి నీచమైన కామెంట్స్‌ చేశాడు. కరీనాకపూర్‌ని బికినీలో చూసిన చిన్న వయసులోనే నాకు మూడ్‌ వచ్చేది.

 

ఇక అనుష్కకి గిల్లించుకోవాలని ఉంటే గిల్లడానికి నాకే అభ్యంతరం లేదని ఆయన వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. అవే ఇప్పుడు ఆయన కొంపముంచుతున్నాయి. ఇటీవలే ఆయన దీపికాపడుకొనేని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్న సమయంలో ఇవి ఆయనకు తలనొప్పిగా మారాయి. ఈ వ్యాఖ్యలు చేసిన వారినే కాదు.. అలా మాట్లాడేలా చేసిన కరణ్‌జోహార్‌ కూడా ఇందుకు బాధ్యుడేనని చెప్పాలి. అసలు కాఫీ విత్‌ కరణ్‌ వంటి షోలను ఆపకుండా అందులో పాల్గొని వ్యాఖ్యలు చేసిన వారిని పూర్తిగా దీనికి బాధ్యులను చేయడం కూడా సరికాదనే చెప్పాలి. 

One more star booked with koffe with karan show:

Ranveer Singh faces problems with koffee with karan show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs