Advertisement
Google Ads BL

కాసేపు కనబడినా చాలనే ఆ పాత్రలు చేశారా?


సూపర్‌స్టార్ రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఆయన పక్కన నటించాలంటే పెట్టిపుట్టాలనట్టుగా ఉంటుంది హీరోయిన్స్ వ్యవహారం. రజినీకాంత్ పక్కన ఛాన్స్ వచ్చింది అంటే ఆ హీరోయిన్ కి పండగే. అయితే కొన్నాళ్లుగా రజినీకాంత్ పక్కన వయసున్న హీరోయిన్స్ నటిస్తున్నారు. కాలా కానివ్వండి కబాలీలో కానివ్వండి కాస్త వయసు మీరిన హీరోయిన్స్ రజిని పక్కన నటించారు. తాజాగా పెట్టాలో మొదటిసారి రజినీకాంత్ పక్కన సిమ్రాన్ అండ్ త్రిషలు ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక పేటలో రజిని సరసన ఛాన్స్ వచ్చినందుకు గాను త్రిష తెగ ఆనందపడిపోయింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక రజినీకాంత్ - త్రిషల పేట పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉండడం.. పేట ట్రైలర్ లో త్రిష ట్రెడిషనల్ లుక్ చూసిన వారు పేట లో త్రిష రోల్ మీద అంచనాలు పెంచుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ సినిమాలో చూసేసరికి త్రిష కేరెక్టర్ కి అస్సలు ప్రాధాన్యత లేదు. రజినీకాంత్ భార్యగా త్రిష ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. ఇక పేట ట్రైలర్‌లో చాలా చిన్న సీన్‌లో కనబడినట్లుగానే పేట సినిమాలో త్రిష కేరెక్టర్ ని కార్తీక్ సుబ్బరాజు డిజైన్ చేసాడు. అసలు ఫస్ట్ హాఫ్‌లో త్రిష కనబడదు. అయితే ఫస్ట్ హాఫ్ లో లేని త్రిష సెకండ్ హాఫ్ లో బలంగా కనిపిస్తుందేమోలే అనుకున్న ప్రేక్షకుడికి నిరాశే కలుగుతుంది. మరో హీరోయిన్ సిమ్ర‌ాన్‌ కి రజినీకి లవ్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సిమ్రాన్ కేరెక్టర్ ని కూడా దర్శకుడు సరిగ్గా తీర్చి దిద్దలేకపోయాడు. 

అసలు సిమ్రాన్, త్రిష‌.. ఇద్ద‌రి ట్రాకులూ వేస్టే. అస‌లు వీరిద్ద‌రినీ దర్శకుడు ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు. ఏదో హీరోయిన్స్ ఉంటేనే ప్రేక్షకుడు మెచ్చుతాడు అన్నట్టుగా ఉంది.. పేటలో హీరోయిన్స్ పరిస్థితి. ఇక త్రిష‌ ఒక‌టో రెండో డైలాగులు‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇంత దానికి త్రిష ఎందుకు అంత ఇదైపోయిందో ఆమెకే తెలియాలి. ఏదో రజిని సినిమాలో కాసేపు కనబడినా చాలు అన్నట్టు ఉంది త్రిష కేరెక్టర్ పెట్టాలో.

No Importance to Simran and Trisha Roles in Peta Movie:

comments on Simran and Trisha Roles in Peta
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs