Advertisement
Google Ads BL

వివాదాల హీరోకి భలే పాత్ర ఇచ్చారు


దక్షిణాదిలో అత్యంత వివాదాస్పద హీరో ఎవరు అంటే ఎవరైనా ఠక్కున కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌ శింబు పేరే చెబుతారు. నయనతార నుంచి హన్సికతో పాటు ఎందరితోనే ఆయన ప్రేమాయణం కొనసాగించి, చివరకు వారికి హ్యాండ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ధనుష్‌కి, విశాల్‌కి బద్ద విరోధిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే ట్రిపుల్‌ ఎ చిత్రం వివాదంలో ఇరుకున్నాడు. అయినా పెద్ద పెద్ద దర్శకుల నుంచి మాత్రం ఆయనకు మంచి అవకాశాలు, పాత్రలు వస్తూనే ఉన్నాయి. మంచి బ్యాగ్రౌండ్‌ మాత్రమే కాకుండా టాలెంట్‌ కూడా ఉన్న నటుడు కావడంతో ఆయన కెరీర్‌ ఇంకా బాగానే సాగుతోంది. 

Advertisement
CJ Advs

ఇటీవలే మణిరత్నం తీసిన ‘నవాబ్‌’ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించాడు. ప్రస్తుతం ఆయనకు కోలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు శంకర్‌తో పనిచేసే అవకాశం లభించింది. ‘ఐ’తో పాటు ‘2.ఓ’ చిత్రం కూడా బయ్యర్లకు నష్టాలనే మిగిల్చిన నేపధ్యంలో కమల్‌ జీవించి, నటించిన ‘భారతీయుడు’ సీక్వెల్‌తో మరోసారి గాడిలో పడాలని శంకర్‌ పట్టుదలగా ఉన్నాడు. ‘భారతీయుడు’లో ‘సేనాపతి’గా ముసలి తండ్రి పాత్రను, ‘చంద్రబోస్‌’గా అవినీతిపరుడైన కుమారుడి పాత్రను కమల్‌ పోషించిన సంగతి తెలిసిందే.

ఇక ‘భారతీయుడు2’లో సేనాపతి మనవడిగా, ‘చంద్రబోస్‌’ కుమారుడి పాత్రకు శంకర్‌ శింబుని ఏరికోరి ఎంచుకున్నాడు. ఇందులో కమల్‌, శింబు అన్నయ్యగా అంటే చంద్రబోస్‌ పెద్ద కుమారుడి పాత్రను పోషిస్తున్నాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఆయనకు జంటగా కాజోల్‌తో పాటు ఓ కొరియన్‌ నటి కూడా నటిస్తూ ఉండటం విశేషం. దేశంలోని అవినీతిపై శంకర్‌ సంధించిన అస్త్రంగా ‘భారతీయుడు’ సినీ చరిత్రలో నిలుస్తుంది. మరి దాని సీక్వెల్‌ ద్వారా రాజకీయాలలోకి వెళ్లిన కమల్‌కే కాక శంకర్‌కి, శింబు వంటి వారికి కూడా ఈ సీక్వెల్‌ అత్యంత కీలకంగా నిలవనుంది. 

ఈ చిత్రాన్ని కూడా శంకర్‌ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించనున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ని ఆయన ఏకంగా ఎనిమిది దేశాలలో ప్లాన్‌ చేశాడు. ఈ ఎనిమిది దేశాలలోని అత్యద్భుత లోకేషన్లలో ఈ మూవీని శంకర్‌ సెల్యులాయిడ్‌పైకి ఎక్కించనున్నాడు. 

Controversial Hero in Shankar Indian 2:

Simbhu got Chance in Indian 2 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs