Advertisement
Google Ads BL

అనుష్క కోసం హాలీవుడ్ నుంచి దింపుతున్నారు

anushka,anushka shetty,anushka 46 film,kona venkat,madhavan,hollywood actor | అనుష్క కోసం హాలీవుడ్ నుంచి దింపుతున్నారు

తెలుగు చిత్రాలలో అడపాదడపా పెద్దగా పేరులేని హాలీవుడ్‌ నటులు నటించి ఉన్నారు. కానీ వీటిల్లో ఎక్కువగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో వచ్చిన ‘పడమటి సంధ్యారాగం’ అనే చెప్పాలి. ఇక తాజాగా మరో హాలీవుడ్‌ నటుడు తెలుగులో నటించడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇతనేమి పెద్దగా అనామకుడు కాదు. బాగానే పేరున్న మంచి నటుడనే చెప్పాలి. ఆయన పేరే మైఖేల్‌ మాడ్సన్‌. ఆయన హాలీవుడ్‌లో క్వెంటిన్‌ టరంటినోస్‌ కిల్‌బిల్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘వన్స్‌ ఆపానే టైం ఇన్‌ హాలీవుడ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈయన అనుష్క తర్వాత సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

విషయానికి వస్తే హీరోలను ఊహించుకుంటూ కలలు కంటూ డ్యూయెట్స్‌ పాడుకునే పాత్రలను స్వీటీ అనుష్క దూరం పెట్టి చాలా కాలమే అయింది. ‘అరుంధతి’ చిత్రంతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు, హీరోలతో సరిసమానమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలను మొదలుపెట్టింది. మధ్యలో ఒకటి అరా గ్లామర్‌ హీరోయిన్‌గా నటించినా కూడా ఆమెకి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలే బాగా పేరు తీసుకుని వచ్చాయి. ‘బాహుబలి’లో దేవసేనగా, ‘రుద్రమదేవి, వర్ణ, సైజ్‌జీరో, భాగమతి’ వంటి చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈమె ‘భాగమతి’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుంది.

‘సైజ్‌జీరో’ సమయంలో విపరీతంగా బరువు పెరిగిన ఆమె ఆ లావును తగ్గించుకుని మరలా పూర్వపు స్థితికి రావడానికి చాలా కష్టమే పడింది. ఇప్పుడు యూరప్‌లో నేచురల్‌ వెయిట్‌లాస్‌ ట్రీట్‌మెంట్‌ని తీసుకుని మరలా తన పూర్వపు గ్లామర్‌ని అందుకుందని సమాచారం. తాజాగా ఆమె ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో కోనవెంకట్‌ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ మూవీ రూపొందనుంది. అధికభాగం షూటింగ్‌ అమెరికాలో జరుగుతుంది. ఇందులో వినికిడి శక్తి లేని మూగయువతి పాత్రను ఆమె చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ కోన వెంకట్ ఖండించారు. 

ఈ మూవీకి కథ ప్రకారం ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో జరిగే షూటింగ్‌లో మైఖేల్‌ మాడ్సన్‌ పాల్గొంటాడట. ఓ హాలీవుడ్‌ నటుడు ఇందులో కీలకపాత్రను పోషిస్తూ ఉండటంతో కథా నేపధ్యంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఇందులో మాధవన్‌ మరో కీలకపాత్రను పోషిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వాటికి మాధవన్‌ చెక్‌ పెట్టాడు. తాను ‘సవ్యసాచి’ తర్వాత మరో చిత్రంలో నటించేందుకు ఇప్పటివరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని, ఇదంతా కేవలం పుకారేనని ఆయన తేల్చడంతో దానిపై ఓ క్లారిటీ వచ్చింది. 

మరి ఈ చిత్రం స్వీటీ అనుష్కకే కాకుండా దర్శకునిగా హేమంత్‌ మధుకర్‌కి మంచి హిట్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది..! 

Hollywood Actor in Anushka 46 Film:

Anushka 46 Film Latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs