Advertisement
Google Ads BL

బాలయ్య, బోయపాటి సినిమా ఉంటుందా..?


బాలకృష్ణ చాలా ఏళ్లుగా ప్లాఫులతో సతమతమవుతున్నప్పుడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి బాలకృష్ణకి సింహ సినిమాతో మాస్ హిట్ ఇచ్చాడు. సింహ సినిమాతో బాలకృష్ణ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తరవాత మళ్ళీ లెజెండ్ తో బాలకృష్ణకి తిరుగులేని హిట్ ఇచ్చాడు బోయపాటి. కుటుంబ అనుబందాలతోనే.. మాస్ ఎంటర్టైనర్‌గా వచ్చిన లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్. లెజెండ్ లో విలన్ రోల్ ని కూడా బాగా హైలెట్ చెయ్యడం.. బాలకృష్ణ పాత్రతో పాటుగా విలన్ జగపతి బాబు పాత్రని కూడా బాగా ఎలేవేట్ చేసాడు బోయపాటి. 

Advertisement
CJ Advs

మరి లెజెండ్ తో బాలయ్య పవర్ ఫుల్ నటన, డైలాగ్ డెలివరీ నందమూరి అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేశారు. ఇక లెజెండ్ తర్వాత బాలకృష్ణ వేరే దర్శకులతో బిజీ అయినప్పటికీ.. బోయపాటికి మళ్ళీ బాలయ్య దొరికితే బావుండు అంటూ ఆయన కోసం కథలు రాసుకున్నాడు. మధ్యమధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో, ఇప్పుడు రామ్ చరణ్ తోనూ సినిమాలు చేసుకున్నాడు. 

ఇక బాలకృష్ణ ఈ మధ్యనే అంటే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తదుపరి చిత్రం తన నిర్మాణ సంస్థలోనే బోయపాటి డైరెక్షన్ లో ఉండబోతుందని.. ఫిబ్రవరిలో బోయపాటి కాంబోలో మూవీ పట్టాలెక్కుతుందని ప్రకటించాడు. ఇక తాజాగా బోయపాటి.. రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ సంక్రాతి కానుకగా విడుదలైంది. కేవలం మాస్ ప్రేక్షకులు  మెచ్చేలా  బోయపాటి వినయ విధేయ రామని తెరకెక్కించాడని... క్లాస్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కదని ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా తేల్చేశారు. 

ఇక సినిమాలో విలన్ రోల్ చేసిన వివేక్ కేరెక్టర్ కూడా తేలిపోయిందంటున్నారు. అయితే ప్రస్తుతం కథానాయకుడుతో డీసెంట్ హిట్ అందుకున్న బాలయ్య.. ఫిబ్రవరి 7న మహానాయకుడుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి మహానాయకుడు కూడా హిట్ అనే సంకేతాలు అందుతున్నాయి. ఇలాంటి టైంలో బాలకృష్ణ వినయ విధేయ రామతో యావరేజ్ హిట్ అందుకున్న బోయపాటి తో సినిమా చేస్తాడంటే కాస్త డౌటే. మరి బాలకృష్ణ, బోయపాటి సినిమా విషయమై మళ్ళీ పునరాలోచనలో పడతాడో.. లేదంటే మెగాభిమానులు అనుకుంటున్నట్లుగా.. చరణ్ సినిమాని కిల్ చేసి ‘ఎన్టీఆర్’కి సహకరించిన బోయపాటికి పిలిచి అగ్రతాంబూలం ఇస్తాడో చూద్దాం. 

Doubts on Balayya and Boyapati Combination:

Nandamuri Fans Happy with VVR Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs