సంక్రాంతి సీజన్ అంటే పెద్ద సినిమాల హడావుడి కంపల్సరీ. ఈ సంక్రాంతికి ఆల్రెడీ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో సినిమా ఈరోజు రిలీజ్ కాకుంది. జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయుడుకు...10 న రజినీ పేట...11 న రామ్ చరణ్ వినయ విధేయ రామ వరుసగా బరిలో దిగిపోయాయి. అయితే మూడింటి రిజల్ట్ ఏంటి అని చూస్తే..
కథానాయకుడు మూవీకి ప్రమోషన్స్ చేసిన ఉపయోగం లేకుండా పోయింది. సినిమా బాగుందని టాక్ వచ్చినా ప్రచారంలో పిసినారితనం బెడిసికొట్టేసింది. దాంతో ఫ్యాన్స్ వరకే ఈ సినిమా రీచ్ అవుతుంది కానీ సాధారణ ప్రేక్షకులకి మాత్రం రీచే అవ్వడంలేదు. ఇక పేట చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తమిళనాడులో ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు కానీ ఇక్కడే డివైడ్ టాక్ వస్తుంది. రజినీ పాత అవతారంలోకి మారిపోయారని అతడి నటన బావుందని అంటున్నా రొటీన్ కథ కొన్నికొన్ని చోట్ల బోర్ కొట్టిందని అన్నారు. పైగా తెలుగులో ఈ సినిమాలు అసలు అంటే అసలు ప్రచారం లేదు.
ఇక నిన్న రిలీజ్ అయిన ‘వినయ విధేయ రామ’ చిత్రానికి ప్రమోషన్ ఫర్వాలేదు కానీ జనంలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకు తెగ పొగిడేస్తున్నారు.. కానీ యాంటీ ఫ్యాన్స్ డిజాస్టర్ అని టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిపోనుంది. ఇక అందరి కళ్ళు ఈ రోజు విడుదల అయ్యే ఎఫ్ 2 చిత్రం పైనే ఉంది. అయితే ఈ సినిమాకి కూడా అసలు ప్రమోషన్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బాగుందని టాక్ వస్తే తప్ప ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. దిల్ రాజు సినిమాల ప్రమోషన్స్ విషయంలో ముందు ఉంటాడు కానీ ఈసారి లేడు. మరి ఎందుకో ఈసారి ఎవరూ ప్రమోషన్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.