ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా థియేటర్స్ లో సందడి చేస్తుంది. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సాంగ్స్ ని విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు పాటలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లుగా మారాయి. ఇక ఇప్పటివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ని కానీ... ఆయా పాత్రల ఫొటోస్ ని కానీ వర్మ వదలలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ ని వర్మ జోరుగా చేస్తున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మిపార్వతిగా ఎవరు నటిస్తారో.. చంద్రబాబుగా ఎవరు నటిస్తున్నారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది.
తాజాగా వర్మ ఒక ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ యాక్టర్ ఏ పాత్ర పోషిస్తున్నారో చెప్పగలరా. అంటూ చంద్రబాబు మాదిరి లుక్స్ ఉన్న ఒక యాక్టర్ ఫోటోని పోస్ట్ చేశాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర ఏ యాక్టర్ చేస్తున్నారో అనేది క్లారిటీ ఇవ్వకుండా వర్మ ఆ పిక్ పోస్ట్ చేశాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుగా వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన వంగవీటిలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీ తేజ్ పోషిస్తున్నాడు. ఇక ఈ శ్రీ తేజ్ ఎన్టీఆర్ కథానాయకుడులో వైఎస్ఆర్ పాత్రలో కనిపించాడు.
మరి చంద్రబాబుగా శ్రీ తేజ్ సూపర్ గా సెట్ అయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడిలో రానా, చంద్రబాబు పాత్రలో అలరిస్తున్నాడు. ఇక రానా.. బాబు లుక్స్ కన్నా ఎక్కువగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో శ్రీ తేజ్ చంద్రబాబుగా బాగా సెట్ అయ్యాడనిపిస్తుంది.