Advertisement
Google Ads BL

హీరోల సినిమాల కోసం ఫ్యాన్స్ చస్తున్నారు


ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీ గత చరిత్ర అద్భుతం. ‘బాషా’తో మొదలుపెట్టి ‘ముత్తు, నరసింహా, అరుణాచలం, చంద్రముఖి’ ఇలా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు. ఇక ‘శివాజీ, రోబో’లు అద్భుతం. కానీ ‘రోబో’ ముందు ఈయనకు ‘కథానాయకుడు, బాబా’ వంటి ఫ్లాప్స్‌ వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. సీనియర్‌ డైరెక్టర్స్‌ని నమ్ముకుని, కథ, కథనాలు, తన పాత్ర, దానికి మేనరిజమ్స్‌, డైలాగ్స్‌ వంటివన్నీ చూసుకుని ముందుకు సాగుతూ వచ్చాడు. కానీ ‘కొచ్చాడయాన్‌(విక్రమసింహ) లింగా, కబాలి, కాలా’ ఇలా వరుసగా ఆయన చిత్రాలు పరాజయం పాలవుతూ వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా విడుదలైన ‘పేట’, ‘భాషా’ తర్వాత సంక్రాంతి పండుగకు వచ్చిన చిత్రం కావడం, సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించడంతో విడుదలకు ముందు తమిళంలో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ‘2.ఓ’ విషయానికి వస్తే అది ఓ ప్రత్యేకమైన చిత్రం. అది కూడా తమిళంలో విజయ్‌ ‘మెర్సల్‌, సర్కార్‌’ వంటి విజయ్‌ రికార్డులను దాటలేకపోయింది. దాంతో కోలీవుడ్‌లో ప్రస్తుతం ఎవర్‌గ్రీన్‌ స్టార్‌ ఎవరు? అనే విషయంలో మరోసారి చర్చ సాగింది. రజనీ తర్వాత స్థానంలో అజిత్‌, విజయ్‌లు ఉన్నారు. కానీ గత కొంతకాలంగా అజిత్‌ కంటే విజయ్‌ చిత్రాలే బాగా వసూలు చేస్తున్నాయి. ఇక తాజాగా రజనీ ‘పేట’, అజిత్‌ ‘విశ్వాసం’ చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. రంజిత్‌పాతో వరుసగా రెండు చిత్రాలు చేసిన రజనీ ఈసారి ‘పిజ్జా, జిగర్‌తాండా’ చిత్రాల ద్వారా మంచి టాలెంట్‌ ఉన్న యంగ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్‌ సుబ్బరాజ్‌కి అవకాశం ఇచ్చాడు. 

కానీ ఇది పూర్తిగా ‘బాషా’కి మరో న్యూ వెర్షన్‌లా తయారైంది. కేవలం ‘బాషా’ ఛాయలు ఉండటంతోనే రజనీ ఇది కూడా మరో చరిత్ర సృష్టిస్తుందని భావించి ఈ అవకాశం ఇచ్చాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇందులో రజనీ అభిమానులను తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లేకుండా పోయాయి. కేవలం మంచి కథ, కథనాలు ఉంటేనే దానికి స్టార్‌ వాల్యూ యాడ్‌ అవుతుందనే విషయాన్ని మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అందునా సినిమా అంతా తమిళ ఫ్లేవర్‌. దాంతో ఇది కేవలం రజనీ ఫ్యాన్స్‌ చిత్రంగా నిలిచిపోయింది. ఇక ‘పేట’తో పాటు తమిళంలో ‘విశ్వాసం’కి కూడా అద్భుతమైన ఓపెనింగ్స్‌ వచ్చాయి. అక్కడ రెండు చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. కానీ తేడా అంతా అజిత్‌తో పాటు విజయ్‌లు కేవలం కోలీవుడ్‌లోనే ఫాంలో ఉండే స్టార్స్‌ కావడం, రజనీ స్థాయిలో వారికి తెలుగు వంటి ఇతర భాషల్లో ఫాలోయింగ్‌ లేకపోవడం ఒక్కటే తేడాగా మారింది. ఇక ‘పేట’ వంటి చిత్రాలు చేయడం కన్నా రజనీ సినిమాలకు గుడ్‌బై చెప్పడం మంచిదనే టాక్‌ వస్తున్నదంటే పరిస్థితి అర్థమవుతోంది. 

ఇక ‘పేట, విశ్వాసం’ రెండు చిత్రాలను ఒకే రోజున విడుదల కాకుండా కనీసం ఒకరోజు గ్యాప్‌ ఇచ్చేలా కూడా ఒప్పించలేకపోయిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ మీద దీనిపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున ఒకే మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లు, పక్క పక్క థియేటర్లలో విడుదలై వందల మంది గుమిగూడి మా హీరో గొప్ప అంటే కాదు.. మా హీరో గొప్ప అంటూ వేలూరులో కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఒక్క వేలూరులోనే కాదు.. తమిళనాట పలు చోట్ల ఇలాంటి యుద్దాలే జరిగాయని ఎందరో తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. మరోవైపు అజిత్‌ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తూ కూడా చాలా మంది అభిమానులు గాయపడ్డారు. ఇలా రజనీ ‘పేట’పై సినిమా పరంగానే కాదు... అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉండటంతో ఈ విషయమై రజనీ ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది..! 

War Between Rajini and Ajith Fans:

Peta vs Viswasam, Fans Wars Starts 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs